ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రహమాన్ కు ఆయన భార్య సైరా బాను విడాకులు ఇచ్చారు. దాదాపు మూడు దశాబ్దాల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతూ సైరా బాను ఈ నిర్ణయం తీసుకున్నారు. రహమాన్ తో ఏర్పడిన అగాథం తొలగేలా లేదని, అందుకే ఆమె విడాకులు తీసుకుంటున్నట్లు చెప్పారని ఆమె తరఫు లాయర్లు వెల్లడించారు. వారి వైవాహిక జీవితం చాలాకాలంగా ఒడిదుడుకులతో సాగుతోన్న నేపథ్యంలోనే వివాహ బంధం నుంచి తప్పుకోవాలని సైరా బాను భావించారని తెలిపారు.
ఇద్దరి మధ్య వచ్చిన గ్యాప్ తగ్గేలా కనిపించడం లేదని ఇద్దరూ భావించి విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకును్నారని చెప్పారు. ఈ కష్టకాలంలో తమ ప్రైవసీకి గౌరవమివ్వాలని వారు కోరుకున్నారని లాయర్లు వెల్లడించారు. 1995లో మార్చి 12న చెన్నైలో ఏఆర్ రహమాన్, సైరా బానుల పెళ్లి జరిగింది. వారికి ముగ్గురు పిల్లలు ఖతీజా, రహీమా, అమీన్ ఉన్నారు. ఖతీజాకు 2022లో వివాహం జరిగింది.