ఏపీ శాసన మండలి సమావేశాల సందర్భంగా వైసీసీ సభ్యులపై హోం మంత్రి అనిత నిప్పులు చెరిగారు. అనిత మాటల తూటాలు తట్టుకోలేని వైసీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అనిత వేసిన ప్రశ్నలకు జవాబు చెప్పలే సీనియర్ ఎమ్మెల్సీ బొత్స సభ నుంచి వెళ్లిపోయారు. లా అండ్ ఆర్డర్, మహిళల అత్యాచార ఘటనలపై మండలిలో వాడివేడీ చర్చ జరిగింది. ఐదేళ్ల వైసీపీ పాలనతో పోలిస్తే ఐదు నెలల ఎన్డీఏ పాలనలో క్రైమ్ రేటు తగ్గిందని వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు అనిత కౌంటర్ ఇచ్చారు.
తమ హయాంలో నేరం జరిగిన 24-48 గంటలలోపు నిందితులను పట్టుకున్నామని, స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేసి సత్వరం శిక్ష పడేలా చూస్తున్నామని అన్నారు. మహిళల భద్రతకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసిందని…ఆఖరికి జగన్ తల్లికి, చెల్లికి అన్యాయం జరిగినా తమ ప్రభుత్వం అండగా నిలబడుతుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దిశ చట్టానికి చట్టబద్ధత లేదని, చట్టబద్ధత ఉన్న నిర్భయ చట్టం కింద కేసులు గత ప్రభుత్వం నమోదు చేయలేదని అన్నారు.
తాను ఏం తప్పు మాట్లాడానో వైసీపీ సభ్యులు చెప్పకుండా ఎందుకు సభలో నిలుచొని గందరగోళం చేస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు. ఆనాడు జగన్ ఇంటికి కూతవేటు దూరంలో రేప్ జరిగితే బాధితురాలికి న్యాయం జరగలేదని ఆరోపించారు. జగన్ పర్యటనకు పరదాలు కట్టడానికి, టీడీపీ నేతల అరెస్టుల వంటి విధులే పోలీసులకు సరిపోయయాని విమర్శఇంచారు. కేంద్రం 200 కోట్ల రూపాయలిస్తే ఐదేళ్లలో ఫోరెన్సిక్ ల్యాబ్ కట్టడం చేతకాలేదని ఎద్దేవా చేశారు. దువ్వాడ శ్రీనివాస్ వంటి వారు, మర్డర్ చేసి డోర్ డెలివరీ చేసిన వారు సభకు వస్తున్నారని విమర్శించారు. తాను చెప్పే విషయాలు వినేందుకు దమ్ము, ధైర్యం కావాలని వైసీపీ సభ్యులనుద్దేశించి అనిత అన్నారు.