‘శ్రీనివాసరావు అడుసుమిల్లి’ గారికి ఏపీ ప్రభుత్వం గుర్తింపునివ్వాలంటోన్న ఎన్నారైలు మరియు వివిధ రాష్ట్రాలలో స్ధిరపడిన తెలుగువారు.
జగన్ అరాచకానికి వ్యతిరేకంగా మాట్లాడటానికి చాలా మంది సంకోచించే సమయంలో ఈయన తన గొంతు వినిపించారు.
వైసీపీపై పోరాడిన ‘శ్రీనివాసరావు అడుసుమిల్లి’ కు ఏపీ ప్రభుత్వం తగిన హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు ప్రవాసాంధ్రులు.
ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ‘శ్రీనివాసరావు అడుసుమిల్లి’ తెలుగు ప్రజలకు సుపరిచితులే.
సరళమైన భాషతో సున్నితమైన భావంతో ఆలోచింపచేసే శైలిలో మాట్లాడడం ‘శ్రీనివాసరావు అడుసుమిల్లి’ నైజం.
సామాజిక మాధ్యమాలలో వివిధ కధనాలు రాసే ‘శ్రీనివాసరావు అడుసుమిల్లి’ రాజకీయ, సామాజిక అంశాలతోపాటు వినోదం జీవన విధానంపై ఆయన రాసే వ్యాసాలు లక్షలాది మందిని ఆకట్టుకున్నాయి.
అచ్చ తెలుగులో అలవోకగా అన్ని విషయాలను వివరించడంలో ఆయన దిట్ట.
తన కధనంతో పాఠకుడిని ప్రయాణింపజేయగలగడంలో ఆయన నేర్పరి.
‘శ్రీనివాసరావు అడుసుమిల్లి’ భాష, యాస ఎవరినైనా ఆకట్టుకుంటుందంటే అతిశయోక్తి కాదు.
వైసీపీ పాలనపై, ఏపీలో ఐదేళ్ళ జగన్ అరాచకంపై నిరంతరం తన వ్యాఖ్యలతో, వ్యాఖ్యానాలతో, వ్యాసాలతో ఆయన పోరాటం చేశారు.
ప్రజావ్యతిరేక నిర్ణయాలు, రాజ్యాంగ, చట్ట ఉల్లంఘనలపై ఆయన అలుపెరుగని ‘అక్షర యుద్ధం’ చేశారు.
ఆయన మాటలు కేవలం విమర్శల మాదిరిగా కాకుండా ప్రతి ఒక్క ఆంధ్రుడిని ఆలోచింపచేసేలా..ఉత్తేజపరిచేలా ఉండేవి.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు ఆయన అభిప్రాయాలతో ఏకీభవించేవారు.
‘శ్రీనివాసరావు అడుసుమిల్లి’ వంటి వ్యక్తుల గొంతు నొక్కేందుకు గత ప్రభుత్వం ప్రయత్నించినా ఆయన అదరలేదు, బెదరలేదు.
అందుకే, ‘శ్రీనివాసరావు అడుసుమిల్లి’ వంటి వ్యక్తులకు తగిన గుర్తింపు లభిస్తే బాగుంటుందని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు, ఎన్నారైలు కోరుకుంటున్నారు.
ఆయనకు ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వం సముచిత స్థానం కల్పించాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు కోరుకుంటున్నారు.
ప్రభుత్వపరంగా పదవి లేదా హోదా పొందేందుకు శ్రీనివాస్ అన్ని విధాలా అర్హుడని ఎన్నారైలు అంటున్నారు.