మీనాక్షి చౌదరి.. ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ ఫేవరేట్ గా మారింది. డాక్టర్ చదివి యాక్టర్ అయిన ముద్దుగుమ్మల్లో మీనాక్షి ఒకరు. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన మీనాక్షి.. ఆ తర్వాత హీరోయిన్ గా మారింది. `ఇచ్చట వాహనములు నిలపరాదు` చిత్రంతో మీనాక్షి తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆమె రెండో చిత్రం `హిట్ 2` సూపర్ హిట్ అయింది. కానీ ఆ మూవీ క్రెడిట్స్ అన్ని హీరో అడివి శేష్ కి వెళ్ళిపోయాయి. ఇక ఏడాది ఆరంభంలో గుంటూరు కారం చిత్రంలో మహేష్ బాబుకు మరదలుగా నటించి మీనాక్షి భారీ పాపులారిటీ సంపాదించుకుంది.
రీసెంట్ గా లక్కీ భాస్కర్ మూవీ తో బిగ్ హిట్ ను ఖాతాలో వేసుకుంది. ఆ వెంటనే మట్కతో పలకరించింది. ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచినప్పటికీ.. ప్రస్తుతం మీనాక్షి పలు క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీ హీరోయిన్ గా సత్తా చాటుతోంది. ఇదిలా ఉండే.. మీనాక్షి పెళ్లి సెట్ అయ్యిందంటూ ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతుంది. అక్కినేని ఫ్యామిలీకి చెందిన హీరోతో మీనాక్షి వివాహం జరగబోతోందని వార్తలు వస్తున్నాయి.
ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు.. ఏఎన్నార్ గారి మనవడు, నాగార్జున మేనల్లుడు సుశాంత్. ఇచ్చట వాహనములు నిలపరాదు చిత్రంలో సుశాంత్, మీనాక్షి జంటగా నటించారు. అయితే ఆ సినిమా చిత్రీకరణ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని.. దాదాపు మూడేళ్ల నుంచి వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని టాక్ నడుస్తోంది.
అంతేకాదు త్వరలో వీరి పెళ్లి కూడా జరుగబోతుందని వార్తలు తెరపైకి రావడంతో.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మీనాక్షి ఓపెన్ అయ్యింది. ప్రస్తుతం తాను సింగిల్ గా ఉన్నానని మీనాక్షి పేర్కొంది. అలాగే ఇప్పట్లో తనకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదని తెగేసి చెప్పింది. సుశాంత్ తో ప్రేమ, పెళ్లి వార్తలపై మీనాక్షి పరోక్షంగా అసహనం వ్యక్తం చేసింది. ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం సినిమాలపైనే ఉందని చెప్పుకొచ్చింది. మీనాక్షి క్లారిటీ ఇవ్వడంతో పుకార్లకు పులిస్టాప్ పడింది.