జగన్ పాలనలో టీచర్లు అనుభవించిన టార్చర్ అంతా ఇంతా కాదు. మరుగు దొడ్లు మొదలు మద్యం షాపుల వరకు టీచర్లకు డ్యూటీలు వేసిన జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న ఉపాధ్యాయుల చేత పాఠాలు చెప్పించాల్సింది పోయి…పాకీ దొడ్ల దగ్గర ఫొటోలు తీయాలి అనడంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా విపరీతంగా జరిగింది. తమ హక్కుల కోసం గళం విప్పిన టీచర్లపై గత ప్రభుత్వం పలు కేసులు కూడా పెట్టింది. ఈ క్రమంలోనే తాజాగా టీచర్లపై పెట్టిన కేసులను ఎత్తివేస్తామని అసెంబ్లీలో నారా లోకేష్ ప్రకటించారు.
ఇకపై టీచర్లకు కేవలం టీచింగ్ కు సంబంధించిన విధులు మాత్రమే అప్పగిస్తామని అన్నారు. ఇకపై బాత్రూమ్ ల దగ్గర డ్యూటీలు చేసే పరిస్థితి ఉపాధ్యాయులకు ఉందని చెప్పారు. టీచర్ల విధులపై జీవో 117కు ప్రత్యామ్నయాలు పరిశీలిస్తున్నామన్నారు. టీచర్లతో చర్చలకు ఎప్పుడూ సిద్ధమని ప్రతి శుక్రవారం 11 నుంచి 3గంటల వరకు టీచర్ల సమస్యల తెలుసుకుంటానని అన్నారు. వచ్చే ఏడాది అకడమిక్ ఈయర్ ప్రారంభమైన నెలలోపు మెగా డిఎస్సీ నియామకాలు పూర్తి చేేస్తామని చెప్పారు.
1994 నుంచి ఏపీలో రాష్ట్ర స్థాయిలో డిఎస్సీ మొదలైన తర్వాత 15 డిఎస్సీలు టీడీపీ హయాంలోనే వేశామని అన్నారు. 1994-2019 వరకు భర్తీ చేసిన 2.20లక్షల టీచర్ పోస్టులలో 1.80 లక్షల పోస్టులు టీడీపీ ప్రభుత్వమే భర్తీ చేసిందని అన్నారు. 2024 ఎన్నికలకు ముందు హడావిడిగా ఓట్ల కోసమే వైసీపీ ప్రభుత్వం 6100 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిందని, ఐదేళ్లలో ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదని చురకలంటించారు. టీచర్ నియామకాల్లో వయో పరిమితి పెంపుపై త్వరలోని మంచి నిర్ణయం తీసుకుంటామన్నారు. డిఎస్సీపై లీగల్ ఒపినియన్ తీసుకొని పక్కాగా నోటిఫికేషన్ ఇస్తామని అన్నారు.