వైసీపీ నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ రాసలీలల వ్యవహారం కొద్ది సంవత్సరాల క్రితం దేశ రాజకీయాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. బాధ్యత గల ఎంపీ పదవిలో ఉంటూ మాధవ్ మిడ్ నైట్ మసాలా వీడియో వైరల్ కావడం షాకింగ్ గా మారింది. అయితే గోరంట్ల మాధవ్ పై సస్పెన్షన్ వేటు వేయకుండా అలాగే కొనసాగించడం, అతడిపై జగన్ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం మరింత సంచలనం రేపింది. ఇక, అధికారం పోయినా వైసీపీ నేతల లైంగిక వేధింపుల పర్వం మాత్రం కొనసాగుతూనే ఉంది.
వైసీపీ మాజీ మంత్రి మేరుగ నాగార్జునపై ఓ మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం షాకింగ్ గా మారింది. తనకు అండగా ఉంటానని నమ్మించిన నాగార్జున లైంగికంగా వాడుకొని వదిలేశారని విజయవాడకు చెందిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన దగ్గర నుంచి 90 లక్షల రూపాయల నగదును పీఏ ద్వారా నాగార్జున తీసుకున్నారని, ఇప్పుడు ఆ పీఏకు ఫోన్ చేస్తే స్పందించట్లేదని ఆమె సంచలన ఆరోపణ చేశారు.
డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరితే తనను బెదిరిస్తున్నారని ఆమె ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆల్రెడీ 11 సీట్లకే పరిమితం కావడంతో పాటు రకరకాల కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న వైసీపీ నేతలకు ఈ తరహా లైంగిక వేధింపుల కేసులు కూడా తోడు కావడంతో పార్టీ ఇరకాటంలో పడ్డట్లయింది. అయితే, తాను ఏ తప్పూ చేయలేదని, ఎటువంటి వైద్య పరీక్షకైనా సిద్ధమని నాగార్జున అంటున్నారు.