తనపై యుద్ధం చేస్తున్న సోదరిని ఎదుర్కొనేందుకు.. వైసీపీ అధినేత జగన్.. ప్రత్యక్షంగా రంగంలోకి రాలేక పోయారు. కారణాలు ఏమైనా.. కూడా ఆయన తన పరివారాన్ని రంగంలోకి దించారు. నిజానికి ఎన్నికలకు ముందు షర్మిల విషయంలో ఎవరూ మాట్లాడకపోయినా.. ఇప్పుడు ఆస్తుల విషయానికి వస్తే.. మాత్రం జగన్ చెప్పారంటూ.. 24 గంటల పాటు.. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు చాలా మంది మీడియా ముందుకు వచ్చారు.
వీరిలో అనంత వెంకట్రామిరెడ్డి, గుడివాడ అమర్నాథ్, భూమన కరుణాకర్ రెడ్డి, కడపకు చెందిన సతీష్ రెడ్డి, విజయవాడకు చెందిన మల్లాది విష్ణు, మచిలీపట్నానికి చెందిన పేర్ని నాని, సాయిరెడ్డి, సుబ్బారెడ్డి ఇలా.. చాలా మంది షర్మిలకు వ్యతిరేకంగా తమ గళం వినిపించారు. కానీ, ఎవరూ కూడా ఆమె రేంజ్లో ఆమెను టార్గెట్ చేయలేకపోయారు. ఏదో మాట్లాడామంటే.. మాట్లాడినట్టు చేతులు దులుపుకొన్నారు. దీనికి తోడు.. షర్మిల కన్నీరు ఎఫెక్ట్.. వైఎస్ అభిమానులను కదలించింది.
ఫలితంగా వైసీపీ తరఫున వాయిస్ వినిపించిన వారు ప్రయోగించిన.. మాటల తూటాలు.. రాజకీయ టపాసులు పేలలేదు. ఈ పరిణామాలకు తోడు.. వీరందరికీ షర్మిల మరింత ఘాటుగా సమాధానం చెప్పిన విషయం తెలిసిందే. ఇది సర్క్యులేట్ అయినట్టుగా వారు వ్యాఖ్యలు బలంగా వినిపించలేదు. దీంతో వైసీపీ అధినేత జగన్ ప్లేట్ మార్చేశారు. ఇక, అంతా సైలెంట్ అయిపోండి! అంటూ.. ఆదేశాలు జారీ చేశారు. షర్మిలపై ప్రయోగించిన వైసీపీ బాంబులు పేలకపోవడంతోపాటు.. ఎదురు దాడి మరింత పెరగడంతో వైసీపీ తీసుకున్న నిర్ణయం ఆసక్తిగా మారింది.