వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కు`చెంప దెబ్బ- గోడ దెబ్బ` అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. ఒక వైపు సొంత సోదరి.. షర్మిల ఆస్తుల వివాదంలో రెచ్చిపోతున్నారు. జగన్ను ఇరుకున పెట్టేస్తున్నారు. దీని నుంచి బయటకు రాలేకపోతున్న పరిస్థితిని జగన్ ఎదుర్కొంటున్నారు. నిరంతరం షర్మిల ఏదో ఒక అంశంతో జగన్ను టార్గెట్ చేస్తున్నారు. గత 10 రోజులుగా ఈవివాదం మరింత పెరిగిపోయింది. దీనికి సమాధానం చెప్పుకోలేక జగన్ ఇబ్బందులు పడుతున్నారు.
ఇది ఒకరకంగా.. జగన్కు చెంప దెబ్బగా మారింది. ఇక, ఇప్పుడు ప్రభుత్వ పరంగా మరింత గోడ దెబ్బ ఎదురవుతోంది. ప్రస్తుత వివాదానికి మూలకారణంగా ఉన్న సరస్వతీ పవర్ కంపెనీకి సంబంధించిన వ్యవహారంపై ప్రభుత్వం కూపీ లాగుతోంది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అధికారులను ఇప్పటికే పురమాయించారు. సరస్వతీ భూముల విషయంలో ఎక్కడైనా ఆక్రమణలు జరిగాయా ? అన్న విషయంపై ప్రధానంగా దృష్టి పెట్టారు.
అయితే.. అటవీ భూములు ఎక్కడా ఆక్రమణలకు గురైన విషయం ప్రస్తుతానికి వెలుగు చూడకపోయినా.,. మరింత లోతుగా అయితే.. అధ్యయనం జరుగుతోంది. ఇంకోవైపు రెవెన్యూ భూముల విషయాన్ని కూడా.. సర్కారు పరిశీలిస్తోంది. సరస్వతీ పవర్ సంస్థ ఏర్పాటుకు సంబంధించి అప్పట్లో తీసుకున్న భూముల్లో ప్రభుత్వ భూములను కొనుగోలు చేయకుండానే ఆక్రమించుకున్నట్టు తేలితే.. వాటిని తిరిగి స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది.
మరోవైపు.. న్యాయపరంగా కూడా.. సరస్వతీ భూముల వ్యవహారాన్ని తెరమీదికి తీసుకువస్తున్నారు. అప్ప ట్లో అనుమతులు పొందేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని మాయ చేశారన్నది ప్రస్తుత వెలుగు చూస్తున్న అం శం. అదేవిధంగా పర్యావరణ అనుమతులు, కేంద్రం నుంచి తీసుకునే అనుమతుల విషయంపైనా దృష్టి పెట్టారు. ఈ విషయాల్లో ఏ చిన్న తేడా వచ్చినా.. కంపెనీ మూతకు ఆదేశాలిచ్చే అవకాశం ఉంటే ఉండొచ్చు. సో.. ఎలా చూసుకున్నా.. ఇప్పుడు జగన్కు షర్మిలతోనే కాదు.. సర్కారుతోనూ తిప్పలు ఎదురవుతున్నాయన్నది వాస్తవం.