నటసింహం నందమూరి బాలకృష్ణకు కోపం ఎక్కువని, ఆయన పెద్ద కోపిష్టి అని చాలా మంది చెబుతుంటారు. కానీ అదంతా నాణేనికి ఒకవైపే. నిజానికి బాలయ్య ది పాల లాంటి మనసు. ఎవరైనా నచ్చారంటే వారి కోసం ఎక్కడివరకైనా వెళ్తారు. చిరాకులో ఉన్నప్పుడు ఎంత సీరియస్ గా ఉంటారో.. మంచి మూడ్లో ఉన్నప్పుడు అంతే సరదాగా ఉంటారు. ఇతరులపై పంచ్ లు వేసి నవ్విస్తుంటారు. తాజాగా బాలయ్యకు సంబంధించి అటువంటి వీడియోనే ఒకటి నెట్టింట వైరల్ గా మారింది.
తాజాగా ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో బాలయ్య సందడి చేశారు. ఆయనతో పాటు యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి కూడా స్పెషల్ గెస్ట్ గా హాజరైంది. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం అనంతరం బాలయ్య మరియు మీనాక్షి ఇద్దరూ మీడియాతో ముచ్చటించారు. ఈ క్రమంలో ఓ రిపోర్టర్ ` మేడం(వసుంధర దేవి)కి ఎప్పుడైనా చీర కొనిచ్చారా..? అంటూ ఇరకాటంలో పెట్టే ప్రశ్న వేశాడు.
అయితే అందుకు బాలయ్య బదులిస్తూ.. `అది ఇప్పుడు అవసరమా? అనవసరంగా పుల్లలు పెట్టడం కాకపోతే` అంటూ సరదాగా కౌంటర్ ఇచ్చారు. ఇక బాలయ్య కామెంట్స్ కు అక్కడి వారంతా తెగ నవ్వేశారు. ముఖ్యంగా మీనాక్షి చౌదరి పడీపడీ నవ్వుకుంది. కాగా, సినిమాల విషయానికి వస్తే.. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న బాలయ్య ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు. ఎన్బీకే 109 వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది.
Bala, being his regular, the life and soul of any gathering, is my favorite genre 😍
When reporter asked madam ki eppudaina saree tesukocchara? pic.twitter.com/JpdpVv8GiL
— Bobby Blast🧘♂️ (@MCK_NBK) October 10, 2024