అవినీతి కేసుల్లో నిందితుడు
భారత ప్రభుత్వ సంస్థలు 43 వేల కోట్లకు అతడి నుంచి ఆధారాలు సంపాదించాయి
అలా ఆధారాలు దొరకడం వల్లే 16 నెలలు బెయిలు కూడా ఇవ్వకుండా జైలులో పెట్టాయి.
జైలు నుంచి బయటకు వచ్చాక కేసుల నుంచి బయటపడాలంటే అధికారం ఒక్కటే మార్గం అని జగన్ నమ్ముతున్నారు.
అందులో భాగంగా ఎట్లాగైనా అధికారంలోకి రావడానికి చంద్రబాబు పాలన గురించి పచ్చి అబద్ధాలు పదేపదే చెప్పి ప్రజలను మభ్యపెట్టారు.
చివరకు ప్రజలను మాయ చేసి హిప్నటైజ్ చేసినంత సులువుగా వారితో మైండ్ గేమ్ ఆడారు.
చివరకు జడ్జిలపైనే అసత్య ఆరోపణలు చేశారు ముఖ్యమంత్రి జగన్.
ఇది మేము చెప్పినమాట కాదు… సుప్రీంకోర్టు విచారించి తేల్చి జగన్ ఆరోపణలు అసత్యం అని తేల్చింది.
తాను తప్పులు చేసి ఇతరులపై మరకలు అంటించడానికి ప్రయత్నం చేస్తున్న జగన్ పై ఆయన పార్టీ ఎంపీ రఘురామరాజు కోర్టులో కేసు వేశారు.
జగన్ బెయిల్ ను దుర్వినియోగం చేస్తున్నారు. వెంటనే రద్దు చేయండి అంటూ కోర్టులో పిటిషను వేశారు.
ఈ విషయంలో కోర్టులో వాదనలు ముగిశాయి.
ఈ నెల 27న దీనిపై తుదితీర్పు వెలువడనుంది.
మరి ఏం జరుగుతుందో చూడాలి.