ప్రస్తుతం బెంగళూరు పర్యటనలో ఉన్న జగన్.. మరోసారి తన సోదరి, కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల విషయంపై ఎక్కువగా దృష్టి పెట్టినట్టు తెలిసింది. వైసీపీ వర్గాల కథనం మేరకు.. ఇప్పటికే రెండు మూడు సార్లు.. షర్మిల విషయంపై కాంగ్రెస్‌లో తనకు ఉన్న అభిమాన నాయకులు, వైఎస్ కుటుంబంతో సంబంధం ఉన్న వారితో ఆయన చర్చలు జరిపారు. దీంతో కొన్నాళ్ల పాటు షర్మిల మౌనంగా ఉన్నారు. తెరవెనుక ఏం జరిగిందో ఏమో.. జగన్ తన కు ఎంతో ఇష్టమైన హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌కు వెళ్లడం మానేశారు.
దీంతో ఈ లోటస్ పాండ్ భవనం వ్యవహారంలో జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారని.. అందుకే షర్మిల మౌనంగా ఉన్నారని తెలిసింది. దీనిపై పెద్ద ఎత్తున చర్చ కూడా సాగింది. అయితే.. మరోసారి షర్మిల.. గిల్లుడు ప్రారంభమైం ది. ఒక రకంగా చెప్పాలంటే.. తుఫాను అంత వేగం లేకపోయినా.. భారీ వర్షం స్థాయిలో కాకపోయినా.. షర్మిల దూకుడు అయితే తగ్గలేదు. వరదల సమయంలోనూ… విపత్తు సమయంలోనూ.. ఆమె చేసిన కొన్ని కొన్ని వ్యాఖ్యలు వైసీపీకి ఇబ్బందిగా మారాయి.
కృష్నానదిలో పడవల వ్యవహారాన్ని ముందుగా ప్రస్తావించింది.. షర్మిలే. అనంతరమే టీడీపీ దీనిని ఆయుధంగా వాడుకుని.. కేసులు పెట్టింది. ఇక, ఏలేరు రిజర్వాయర్ విషయంలోనూ.. ఆధునీకరించలేదు.. అందుకే ఇలా జరి గిందంటూ.. షర్మిల ఆరోపించారు. ఇలా ప్రభుత్వాన్ని తాము ఇరకాటంలో పెట్టాలని అనుకున్న ప్రతి సందర్భంలో నూ.. షర్మిల ఇస్తున్న `క్లూ`తో సర్కారు.. వైసీపీని టార్గెట్ చేయడంతో జగన్‌కు, వైసీపీ నాయకులకు కూడా మింగుడు పడడం లేదు.
ఈ పరిణామాలే ఇప్పుడు జగన్ కు మరోసారి ఇబ్బందిగా మారాయి. వరదలు, వర్షాల కారణంగా.. సర్కారు విఫలమైం దని చెప్పుకొనే సమయంలో అనూహ్యంగా షర్మిల రెచ్చిపోయి వైసీపీని టార్గెట్ చేయడంతో ఇదే జనంలోకి బలంగా వెళ్లిపోయింది. ఇప్పుడు వరదల కష్టం.. నష్టం అంతా.. కూడా వైసీపీ ఖాతాలోకి పడిపోయింది. దీంతో షర్మిల గిల్లుడు వ్యవహారంపై జగన్ సీరియస్‌గానే ఉన్నారు.
అలాగని పైకి ఏమీ అనకపోయినా.. అంతర్మథనంలో అయితే పడ్డారు. ఈ విషయంపై ఆయన మరోసారి కాంగ్రెస్ నేతలతో చర్చించారని తాజాగా వైసీపీ నాయకుల మధ్య చర్చ జరుగుతోంది. అప్పట్లో లోటస్ పాండ్‌ను వదులుకు న్నారు. ఇప్పుడు ఏం చేస్తారో చూడాలని నాయకులు చెబుతుండడం గమనార్హం. ఏదేమైనా… కంట్లో నలుసుగా మారిన షర్మిల వ్యవహారాన్ని ఈ సారి తేల్చుకునేందుకు జగన్ రెడీగానే ఉన్నారనే తెలుస్తోంది.