ఇటీవల కాలంలో సినీ తారల త్రోబ్యాక్ ఫోటోలు నెట్టింట బాగా ట్రెండ్ అవుతున్నాయి. పైన కనిపిస్తున్న ఫోటో కూడా ఆ కోవకు చెందిందే. అయితే మెగాస్టార్ చిరంజీవి కౌగిట్లో బందీగా ఉన్న ఆ కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా..? అతను టాలీవుడ్ స్టార్ హీరో కుమారుడు. ఇప్పటికే హీరోగా ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టాడు. అతనెవరో కాదు బాసు.. శ్రీకాంత్ తనయుడు రోషన్ మేకా. చిరంజీవి, శ్రీకాంత్ కుటుంబాల మధ్య మంచి సన్నిహిత్యం ఉంది.
ఒక తల్లి కడుపున పుట్టకపోయినా చిరంజీవిని తన సొంత అన్నయ్యలా శ్రీకాంత్ భావిస్తారు. శ్రీకాంత్ అన్నా కూడా చిరంజీవికి అంతే అభిమానం. గతంలో ఒకానొక సందర్భంలో `అన్నయ్యతో నా కుమారుడు` అంటూ చిరు-రోషన్ కలిసి ఉన్న ఫోటోను శ్రీకాంత్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. అది కాస్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. రోషన్ విషయానికి వస్తే.. సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించడంతో అతను కూడా తల్లిదండ్రుల బాటలోనే నడిచాడు.
రుద్రమదేవి మూవీతో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన రోషన్.. 2016లో నిర్మలా కాన్వెంట్ చిత్రంతో ప్రధాన పాత్రలో అరంగేట్రం చేశాడు. 2021లో విడుదలైన పెళ్లి సందడి చిత్రంతో ఫస్ట్ హిట్ అందుకున్నాడు. అయితే ఈ సినిమా విజయం రోషన్ కన్నా హీరో శ్రీలీలకే ఎక్కువ ఉపయోగపింది. ప్రస్తుతం మలయాళ, తెలుగు ద్విభాషా చిత్రం వృషభతో పాటు ఛాంపియన్ అనే మరో సినిమాలో రోషన్ యాక్ట్ చేస్తున్నాడు. హీరోగా ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు గట్టిగా కష్టపడుతున్నాడు.
View this post on Instagram