అన్నీ ఆయన కంపెనీలే. దీంతో లాభాల్లో ఉన్న ఒక కంపెనీ నుంచి నష్టాల్లో ఉన్న మరికొన్ని కంపెనీలకు నిధులు కేటాయించారు. వీటిని రుణాల రూపంలోనే ఆయా కంపెనీలకు ఇచ్చినా.. ఇప్పుడు అదే పెద్ద నేరమైంది. దీంతో ఏకంగా ఆయా కంపెనీలపైనా అనిల్ అంబానీ పైనా.. సదరు కంపెనీలకు చెందిన బోర్డు డైరెక్టర్లపైనా `స్టాక్ ఎక్సేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా`(సెబీ) కొరడా ఝళిపించింది. ఏకంగా కొన్ని సంస్థలపై ఐదేళ్లు, మరికొన్నింటిపై ఆరేళ్ల చొప్పున నిషేధం విధించింది. అదేవిధంగా 25 కోట్ల రూపాయల వరకు జరిమాలు విధించింది.
అసలు ఏం జరగింది?
ప్రముఖ పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీ గురించి అందరికీ తెలిసిందే. ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీలు విడిపోయిన తర్వాత.. అనిల్ అంబానీ సొంతగా వ్యాపారాలు చేస్తున్నారు. అయితే.. ఆయా కంపెనీలు చాలా వరకు నష్టాల్లో కూరుకుపోయాయి. దీంతో 10 ఏళ్ల కిందట రియలన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్‌ను స్థాపించారు. ఇది కొంత వరకు లాభాల్లో దూసుకుపోతోంది. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో లాభాల్లో ఉన్న కంపెనీ ఇదే. దీంతో దీని ద్వారా వచ్చిన లాభాలను ఇతర కంపెనీల్లోకి రుణాల రూపంలో మళ్లించారు.
అయితే.. ఇలా చేయొద్దని.. ఇది నిబంధనలకు విరుద్ధమని రియలన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ బోర్డు డైరెక్టర్లు చెప్పారు. కానీ, అనిల్ అంబానీ మాత్రం.. నష్టాల్లో ఉన్న కంపెనీలు మనవే కాబట్టి వాటిని బతికించుకునే ప్రయత్నం చేయాలన్న ఉద్దేశంతో భారీ ఎత్తున వాటిలోకి నిధులు మళ్లించారు. అయితే .. ఈ వ్యూహం బెడిసి కొట్టింది. ఆయా కంపెనీలు కోలుకోలేదు.. సరికదా.. లాభాల్లో ఉన్న రియలన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్‌కు నష్టాలు వచ్చిపడ్డాయి. దీంతో షేర్లు దెబ్బతిని.. రూ.60 నుంచి రూ.0.75 పైసలకు పడిపోయాయి.
ఈ పరిణామాలపై సెబీకి ఫిర్యాదులు అందాయి. దీంతో ఏడాది కిందట నుంచి విచారణ చేపట్టిన సెబీ.. తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అనిల్ అంబానీకి చెందిన 24 కంపెనీలను సెక్యూరిటీస్ మార్కెట్ల నుంచి 5 సంవత్సరాల పాటు నిషేధం విధించింది. అదేవిధంగా రియలన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ బోర్డు డైరెక్టర్లపై జరిమానాలు విధించింది. దీనిని కూడా ఆరేళ్లపాటు నిషేధంలో పెట్టింది. పైగా.. దీనికి ఒక్కదానికే.. రూ.6 లక్షల వరకు జరిమానా విధించి.. నోటీసులు జారీ చేసింది. ఇతర కంపెనీలపై 25 కోట్ల జరిమానా విధించింది. బోర్డు డైరెక్టర్లు తక్షణం పదవులకు రాజీనామాలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.