యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య రెండో వివాహానికి రెడీ అయిన సంగతి తెలిసిందే. గత కొంతకాలం నుంచి ప్రముఖ హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో ప్రేమాయణం నడుపుతున్న నాగచైతన్య.. ఇప్పుడు ఆమెతోనే ఏడడుగులు వెయ్యబోతున్నాడు. ఆగస్టు 8న వీరి నిశ్చితార్థం వేడుక జరిగింది. అయితే తన మాజీ భర్త రెండో వివాహం చేసుకోవడం పట్ల సమంత ఎలా రియాక్ట్ అవుతుందా? అని అందరూ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆమె పెట్టే ప్రతి పోస్ట్ ను గమనిస్తున్నారు.
ఇక ఇదే తరుణంలో తాజాగా సమంత తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఒక ఫోటో ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది. `ది మ్యూజియం ఆఫ్ పీస్ అండ్ క్వయిట్` అని ఇంగ్లీష్ అక్షరాలతో రాసి ఉన్న స్వెట్ షర్ట్ మరియు కూలింగ్ గ్లాసెస్ ధరించి స్టైలిష్ లుక్ లో సెల్ఫీ తీసుకున్న ఫోటోను సమంత ఎటువంటి క్యాప్షన్ లేకుండా ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ పోస్టుకు నవ్ వి ఆర్ ఫ్రీ అనే సాంగ్ ను కూడా జోడించింది.
అయితే తాజా ఫోటోలో సమంత తన తలకు చేతిని అనిచ్చి మిడిల్ ఫింగర్ ను కొంచెం హైలెట్ చేసింది. అంతే నెట్టింట జనాలు చర్చలు మొదలెట్టేశారు. శోభితతో ఎంగేజ్మెంట్ చేసుకున్న నేపథ్యంలో.. చైతుకు మిడిల్ ఫింగర్ తో సమంత బోల్డ్ కౌంటర్ ఇచ్చిందని నెటిజన్లు బలంగా నమ్ముతున్నారు. ఈ క్రమంలోనే సమంతను ఉద్ధేశిస్తూ ఆమె పోస్ట్ కింద క్వీన్ బిహేవియర్.. ఫైర్.. ఆటిట్యూట్ ఓవర్‌లోడెడ్.. క్లాసిక్ రిప్లై.. ఇలా రకరకాల కామెంట్స్ తో మోత మోగిస్తున్నారు.
View this post on Instagram