మెగా డాటర్ నిహారిక వ్యక్తిగత జీవితం గురించి అందరికీ తెలిసిందే 2020లో జొన్నలగడ్డ చైతన్యను నిహారిక వివాహం చేసుకుంది. కానీ మీరు బంధం ఎక్కువ కాలం సాగలేదు. పెళ్లయిన ఏడాదికి మనస్పర్థలు తలెత్తడంతో చైతన్య నుంచి నిహారిక విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి కెరీర్ పై ఫుల్ ఫోకస్ పెట్టింది. నటిగానే కాకుండా నిర్మాతగా కూడా సత్తా చాటేందుకు కష్టపడుతోంది. ప్రస్తుతం కమిటీ కుర్రాళ్ళు మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. నిహారిక నిర్మించిన ఈ చిత్రం మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారికకు రెండో పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. విడాకుల తర్వాత మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? అని ప్రశ్నించగా.. నిహారిక ఆసక్తికర సమాధానం ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ.. `నేను హ్యాపీగా ఉండాలని భావిస్తున్నా. అది సింగిల్ గా అయినా లేక కమిటెడ్‌గా అయినా. ఇప్పుడు నా దృష్టి నా పని పైనే ఉంది. యాక్టింగ్ తో పాటు మంచి సినిమాలు నిర్మించడానికి ప్రయత్నిస్తాను.
ఇక నా ఏజ్ 30. లైఫ్ లాంగ్ ఒంటరిగానే ఉండిపోవాలని అనుకోవడం లేదు. అయితే రిలేషన్షిప్ లోకి వెళ్లే ముందు నేను ఇండిపెండెంట్ గా ఉండాలనుకుంటున్నాను. మరొకరిపై ఆధారపడాలని అస్సలు లేదు. ఇప్పటికైతే నేను సింగిలే. టైమ్ వచ్చినప్పుడు ఏది జరగాలో అది జరుగుతుంది. నేను మరొకరిని పెళ్లి చేసుకోవాలని మా పేరెంట్స్ భావిస్తున్నప్పటికీ.. నాపై ఒత్తిడి మాత్రం పెట్టరు. మా పేరెంట్స్ నా అభిప్రాయాన్ని గౌరవిస్తారు. నాకు ఎల్లప్పుడూ సపోర్ట్‌గా ఉంటారు` అంటూ ఓపెన్ కామెంట్స్ చేసింది.