ఉస్తాద్ రామ్ పోతినేని, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం `డబుల్ ఇస్మార్ట్`. 2019లో విడుదలై సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ ని రూపొందించారు. ఇందులో కావ్య థాపర్ హీరోయిన్ కాగా.. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ప్రతినాయకుడి పాత్రను పోషించాడు.
పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్ సంయుక్తంగా నిర్మించిన డబుల్ ఇస్మార్ట్ చిత్రం ఆగస్టు 15న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ప్రమోషన్స్ ద్వారా మరింత హైప్ పెంచడానికి మేకర్స్ రెడీ అవుతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా డబుల్ ఇస్మార్ట్ ఓటీటీ డీల్ క్లోజ్ అయింది.
ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ దిగ్గజ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు భారీ ధరకు సొంతం చేసుకున్నారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషలను చెందిన డబుల్ ఇస్మార్ట్ డిజిటల్ రైట్స్ ఏకంగా రూ. 33 కోట్లు పలికాయని తెలుస్తోంది. థియేట్రికల్ రన్ తర్వాత అమెజాన్ ప్రైమ్ లో రామ్ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది.
హిందీ వెర్షన్ ఓటీటీ డీల్ మాత్రం ఇంకా పూర్తి కాలేదు. ఇకపోతే డబుల్ ఇస్మార్ట్ సినిమా యొక్క థియేట్రికల్ హక్కులను కూడా పూరీ జగన్నాథ్, ఛార్మీ విక్రయించారు. రూ. 60 కోట్లకు ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ అధినేతులు కె.నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి థియేట్రికల్ రైట్స్ ను దక్కించుకున్నారని సమచారం.