మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన చిత్రాల్లో `ఇంద్ర` ఒకటి. చిన్ని కృష్ణ అందించిన కథతో బి. గోపాల్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో చిరంజీవి సరసన సోనాలి బింద్రే, ఆర్తి అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. ఫ్యాక్షనిజం బ్యాక్డ్రాప్ లో వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సి.అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రానికి మణి శర్మ స్వరాలు సమకూర్చారు.
అశ్వనీదత్ నిర్మాణంలో చిరంజీవికి ఇది మూడో సినిమా కాగా.. బి. గోపాల్ డైరెక్షన్ లో కూడా మూడో సినిమానే కావడం విశేషం. 2002 జూలై 24న విడుదలైన ఇంద్ర చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. రూ. 10 కోట్ల బడ్జెట్తో నిర్మితమైన ఇంద్ర.. రూ. 55 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
ఉత్తమ నటుడిగా చిరంజీవికి నంది అవార్డును తెచ్చిపెట్టింది. అలాగే నేటితో విడుదలై ఇంద్ర సినిమా 22 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇప్పటికీ ఇంద్ర మూవీ టీవీలో వస్తోంది అంటే ప్రేక్షకులు స్క్రీన్ కి అతుక్కుపోతుంటారు. అంతలా ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది . అయితే 22 ఏళ్ల ఇంద్ర మూవీలో ఒక బిగ్ మిస్టేక్ ఉందన్న సంగతి బహుశా చాలా మందికి తెలిసుండకపోవచ్చు.
ఇంతకీ ఆ తప్పిదం ఏమిటంటే సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో `ఘల్లు ఘల్లుమని` సాంగ్ మీకు గుర్తుండే ఉంటుంది. రాయలసీమలో వర్షం పడడం కోసం ప్రజలంతా పూజలు చేసే క్రమంలో ఆ సాంగ్ వస్తుంది. అయితే ఆ సాంగ్ తర్వాత ఇంద్ర సేనుడి ఇంట్లో కుటుంబీకులు అంతా రంగులు జల్లుకుంటూ హోళీ సెలబ్రేట్ చేసుకుంటారు. అదే రోజు రాఖీ పండుగ కూడా వారింట్లో జరుగుతుంది. చిరంజీవికి తన చెల్లెల్లు రాఖీలు కట్టి ఆశీర్వదిస్తారు. నిజానికి హోళీ, రాఖీ పండుగలు ఒకేసారి రావు.. వచ్చిన సందర్భాలు లేవు. కానీ డైరెక్టర్ బి.గోపాల్ ఆ రెండు ఫెస్టివల్స్ ను ఒకే రోజు వచ్చినట్లు చూపిస్తారు. ఇదే ఇంద్ర సినిమాలో ఉన్న బ్లండర్ మిస్టేక్.