పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవల కల్కి 2898 ఏడీ మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్స్ లో `ది రాజా సాబ్` ఒకటి. ఇదొక హారర్-కామెడీ చిత్రం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్న రాజా సాబ్ కు మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు.
నిధి అగర్వాల్, మాళవిక మోహన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా యాక్ట్ చేస్తున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న రాజా సాబ్ మరికొన్ని నెలల్లో థియేటర్స్ లో సందడి చేయబోతోంది. అయితే ఈ చిత్రానికి ప్రభాస్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ మారింది. సాధారణంగా ఒక్కో సినిమాకు రూ. 150 కోట్ల రేంజ్ లో పారితోషికం పుచ్చుకుంటున్న ప్రభాస్.. రాజా సాబ్ కోసం రూ. 100 కోట్లు మాత్రమే ఛార్జ్ చేస్తున్నారట. రెమ్యునరేషన్ లో తనకు తానే రూ. 50 కోట్లు కోత విధించుకున్నారట.
అయితే ఇందుకు ఒక బలమైన కారణమే ఉంది. గతంలో ప్రభాస్ యాక్ట్ చేసిన ఆదిపురుష్ తెలుగు థియేట్రికల్ హక్కులను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారే భారీ మొత్తానికి దక్కించుకుని విడుదల చేశారు. కానీ ఆదిపురుష్ సినిమా ఎన్నో అంచనాల నడుమ వచ్చి ఫ్లాప్ అయింది. దాంతో నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ భారీగా నష్టపోయారు. ఆ నష్టాలను పూడ్చడం కోసమే ప్రభాస్ ఇప్పుడిలా రాజా సాబ్ సినిమా కోసం తన రెమ్యునరేషన్ తగ్గించుకున్నాడని జోరుగా వార్తలు వస్తున్నాయి.