మిల్కీ బ్యూటీ తమన్నా అంటే తెలియని వారు ఉండరు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు నేమ్ అండ్ ఫ్రేమ్ సంపాదించుకున్న హీరోయిన్లలో తమన్నా ఒకటి. ఇండస్ట్రీలోకి వచ్చి రెండు దశాబ్దాలు అవుతున్నా ఇంకా స్టార్ హీరోయిన్ గానే ఆమె సత్తా చాటుతోంది. అయితే తాజాగా తమన్నా లైఫ్ స్టోరీని ఓ పాఠశాల తమ విద్యార్థులకు పాఠ్యాంశంగా చేర్చింది. దీంతో పిల్లల పేరెంట్స్ నుంచి షాకింగ్ రెస్పాన్స్ వచ్చింది.
స్కూల్ పుస్తకాల్లో తమన్నా పాఠ్యాంశాన్ని చూసినా తల్లిదండ్రులు సదరు పాఠశాల యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం బెంగుళూరులోని హెబ్బాలలో చోటుచేసుకుంది. ఆ ప్రాంతంలో సింధీ ఉన్నత పాఠశాల వారు 7వ తరగతి పుస్తకాల్లో సింధీ సామాజిక వర్గానికి చెందిన నటి తమన్నా, బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ ల గురించి పాఠ్యాంశాలు చేర్చారు.
స్వాతంత్య్రం వచ్చాక సింధూ ప్రాంత విభజన తర్వాత ఆ సామాజిక వర్గ ప్రజల జీవితాలు ఎలా ఉన్నాయనే విషయాన్ని తెలియజేయడం కోసం ఇలా చేశారు. అయితే అది కాస్త వివాదంగా మారింది. సింధీ వర్గంలో ఎంతో మంది కళాకారులు ఉండగా.. వారిని పక్కన పెట్టి సినిమాల్లో గ్లామర్ డాల్ గా చేసే తమన్నా గురించి పాఠ్యాంశాన్ని చేర్చడం విద్యార్థాల తల్లిదండ్రులకు ఏమాత్రం నచ్చలేదు.
దీంతో పాఠశాలకు వచ్చి పేరెంట్స్ గొడవ చేయగా.. సినిమా రంగంలో సింధీ వర్గానికి చెందిన తమన్నా ఎన్నో విజయాలు సాధించిన కారణంగానే ఇలా చేశామని యాజమాన్యం వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. అయినాసరే తల్లిదండ్రులు వినకపోవడంతో.. సదరు స్కూల్ యాజమాన్యం పిల్లలకు టీసీ ఇచ్చేస్తామంటూ బెదిరింపులకు దిగింది. దీంతో పిల్లల పేరెంట్స్ పోలీసులను ఆశ్రయించడంతో విషయం కాస్త చర్చనీయాంశంగా మారింది. కర్ణాటకకు చెందిన ఇంగ్లీష్ స్కూల్స్ అసోసియేషన్ ఈ వ్యవహారంపై విచారణ చేపట్టింది.
என்னங்கடா இதெல்லாம்!? 😣#TamannaahBhatia pic.twitter.com/ieg2wQEges
— Ramani Prabha Devi (@ramaniprabadevi) June 27, 2024