తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉన్న మల్టీ టాలెంటెడ్ పర్సన్స్ లో శ్రీనివాస్ అవసరాల ఒకరు. నటుడు గానే కాకుండా దర్శకుడిగా, స్క్రీన్ రైటర్ గా టెలివిజన్ ప్రెజెంటర్ గా శ్రీనివాస్ ప్రసిద్ధి చెందాడు. అలాగే ప్రొఫెషనల్ రాకెట్‌బాల్ ప్లేయర్ గా కూడా సత్తా చాటాడు. మెకానికల్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ కలిగి ఉన్న శ్రీనివాస్ అవసరాల.. యునైటెడ్ స్టేట్స్ లో కొన్నాళ్లు ప్రిన్స్టన్ ప్లాస్మా ఫిజిక్స్ లేబొరేటరీలో ఉద్యోగం చేశాడు.
అయితే సినిమాలపై ఉన్న మక్కువ కారణంగా అవసరాల జాబ్ వదిలేశాడు. లాస్ ఏంజలెస్ లో స్క్రీన్ రైటింగ్ లో డిప్లోమా చేశాడు. అలాగే న్యూయార్క్ లో ఒక ఏడాది యాక్టింగ్ లో శిక్షణ తీసుకున్నాడు. ఆ తర్వాత అక్కడే బ్లైండ్ యాంబిషన్ అనే చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. 2008లో అష్టా చమ్మా మూవీతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు. 2008లో విడుదలైన ఈ చిత్రం విజయం సాధించడమే కాకుండా హీరోలుగా నటించిన నాని మరియు శ్రీనివాస్ అవసరాలకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.
ఆ తర్వాత అవసరాల ప్రయాణం మనందరికీ తెలిసిందే. నటుడిగా, దర్శకుడిగా, రచయితగా తనను తాను నిరూపించుకున్నాడు. సినీ పరిశ్రమలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. అయితే ఈ మల్టీ టాలెంటెడ్ యాక్టర్ ఒంటి మీదకు 43 ఏళ్లు వచ్చినా పెళ్లి చేసుకోకుండా ఇంకా సింగిల్ లైఫ్‌నే లీడ్ చేస్తుండటం గమన్నార్హం. పైగా పెళ్లి ప్రస్తావన ఎత్తితే సోలో బ్రతుకే సో బెటర్ అంటున్నాడు.
రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తాను పెళ్లి చేసుకోనంటూ స్టేట్మెంట్ ఇచ్చేశాడు. అందుకు కారణం కూడా అవసరాల వెల్లడించాడు. `నా రియల్ లైఫ్‌లో అమ్మాయే లేదు. ఇకపై ఉండరు కూడా. మనపాటికి మనం హాయిగా ఉన్నప్పుడు వేరొక వ్యక్తి తీసుకొచ్చి మన లైఫ్‌లో పెట్టడం అనేది కఠిన నిర్ణయమని నా ఫీలింగ్. ప్రస్తుతం నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు పెళ్లి చేసుకునే ఉద్ధేశమే లేదు` అంటూ అవసరాల చెప్పుకొచ్చాడు. జీవితాంతం బ్రహ్మచారిగానే ఉండిపోతానని కన్ఫార్మ్ చేశాడు.