సితార ఘట్టమనేని.. ఈ చిన్నారి సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురుగానే కాకుండా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. ఎప్పటికప్పుడు ఫోటోలు, డాన్స్ వీడియోలు పంచుకుంటూ భారీగా ఫాలోవర్స్ ను సంపాదించుకుంది. 12 ఏళ్ళ వయసుకే హీరోయిన్లను మించిన అందంతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్న సితార.. గత ఏడాది ప్రముఖ అంతర్జాతీయ జ్యువెలరీ సంస్థ పీఎంజే బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. సదరు జ్యువెలరీ బ్రాండ్ ప్రమోషనల్ యాడ్ లో యాక్ట్ చేసి రూ. కోటి రెమ్యునరేషన్ తీసుకుంది.
అలాగే సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటూ తండ్రికి తగ్గ తనయగా పేరు తెచ్చుకుంటోంది. ఇకపోతే సితార ప్రస్తుతం ఓవైపు చదువుకుంటూనే.. మరోవైపు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. యాక్టింగ్ మరియు డాన్సుల్లో శిక్షణ తీసుకుంటోంది. నటనపై తనకు ఆసక్తి ఉన్నట్లు ఇప్పటికే సితార పలుమార్లు వెల్లడించింది.
అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మరోసారి సితార తన ఫిల్మ్ ఎంట్రీ గురించి మాట్లాడింది. `చిన్నతనం నుంచి నేను నాన్నను చూస్తూ పెరిగాను. ఆ క్రమంలోనే సినిమాలపై మరియు నటనపై నాకు ఆసక్తి ఏర్పడింది. అందుకే హీరోయిన్ కావాలని ఆశపడుతున్నాను. భవిష్యత్తులో కచ్చితంగా నటిస్తాను. అయితే ఇంగ్లీష్ చిత్రాల్లో మాత్రమే నటించాలి అనుకుంటున్నాను` అని సితార చెప్పుకొచ్చింది. ఇప్పటివరకు అందరూ సితార డెబ్యూ తెలుగులోనే ఉంటుందని అనుకున్నారు. కానీ సితార మాత్రం ఎవరి ఊహలకు అందని విధంగా హాలీవుడ్ పై కన్నేసింది. ఇంగ్లీష్ మూవీతో సినీ రంగ ప్రవేశం చేయాలని ఆరాటపడుతుంది.