నవరత్నాలు ఏపీలో జగన్ ప్రజలకు విసిరిన మన్మోహనాస్త్రాలు. 2019 ఎన్నికల్లో నవరత్నాలు ఎంతో సంచలనం సృష్టించి ప్రజలను ఆకర్షించి జగన్ అధికారంలోకి వచ్చాడు. గత ఎన్నికల్లో జగన్ తరపున వైఎస్ఆర్ సీపీ గెలుపు కోసం ప్రచారం చేసిన ఆయన సోదరి షర్మిల ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కడప ఎంపీ లోక్ సభ స్థానానికి పోటీకి దిగింది. జగన్ పాలనపై తాజాగా షర్మిల లేఖ రూపంలో నవ సందేహాలు సంధించింది. దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది.
1. సాగుభూమిని ఇచ్చే కార్యక్రమాన్ని ఎందుకు ఆపేశారు?
2. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులను దారి మళ్లించడం నిజం కాదా?
3. 28 పథకాలను అర్థాంతరంగా ఎందుకు ఆపేశారు?
4. విదేశీ విద్యా పథకానికి అంబేద్కర్ పేరు ఎందుకు తీసేశారు?
5. సాగు భూమి ఇచ్చే కార్యక్రమాన్ని ఎందుకు నిలిపివేశారు?
6. ఎస్సీ, ఎస్టీ పునరావాస కార్యక్రమం ఏపీలో ఎందుకు నిలిచిపోయింది?
7. ఎస్సీ, ఎస్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్లు ఎందుకు నిరాకరించారు?
8. స్టడీ సర్కిళ్లకు నిధులు ఇవ్వకుండా ఎందుకు నిర్వీర్యం చేశారు?
9. డ్రైవర్ ను చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని ఎందుకు సమర్థిస్తున్నారు?
అంటూ షర్మిల తన లేఖలో తొమ్మిది ప్రశ్నలను సంధించారు.
ఎన్నికల ప్రచారంలో నవరత్నాలను ప్రస్తావిస్తూ వైఎస్ జగన్ ముందుకు సాగుతున్న నేపథ్యంలో షర్మిల నవ సందేహాలు చర్చనీయాంశంగా మారింది. ప్రతిష్టాత్మక ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమరంలో షర్మిల జగన్ కు కంట్లో నలుసులా మారిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.