రాజకీయాల్లో శాశ్వత మితృలు, శాశ్వత శతృవులు ఉండరు. ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో ఎవ్వరూ చెప్పలేరు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో అదే సీన్ రిపీట్ అయింది. గత ఎన్నికలలో ప్రత్యర్ధులుగా పోటీ పడిన ఆ ఇద్దరు నేతలు ఇప్పుడు ఒక్కటయ్యారు. పోయినసారి తనను ఓడించిన వ్యక్తిని గెలిపించాలని ప్రచారం చేస్తున్నాడు.
కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం నుండి గత ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా అభ్యర్థిగా వసంత కృష్ణప్రసాద్, టీడీపీ అభ్యర్థిగా దేవినేని ఉమలు పోటీ చేశారు. 12500 ఓట్ల అధికారంతో ఉమపై కృష్ణప్రసాద్ విజయం సాధించాడు. ఆ తర్వాత ఇద్దరూ నియోజకవర్గంలో కత్తులు దూసుకున్నారు. అయితే అనూహ్యంగా ఈ ఎన్నికలలో వసంత కృష్ణప్రసాద్ వైసీపీని వీడి టీడీపీలో చేరాడు. ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ కృష్ణప్రసాద్ కే అవకాశం ఇచ్చింది.
మారిన పరిస్థితుల నేపథ్యంలో కృష్ణప్రసాద్ తో ఉన్న విభేదాలను పక్కనపెట్టి దేవినేని ఉమ ఆయన గెలుపుకోసం పనిచేస్తున్నాడు. తామిద్దరం మైలవరం నియోజకవర్గంలో ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటామని, రాజకీయ విభేదాలు తప్ప తమ మధ్య వ్యక్తిగత విభేదాలు లేవని, ఈసారి మైలవరంలో టీడీపీ గెలుపుకు అందరూ సహకరించాలని దేవినేని ఉమ విజ్ఞప్తి చేయడం విశేషం.