వైఎస్ విమలారెడ్డి. ఓ ఆరు మాసాలకు ముందు ఈమె ఎవరు? అనేది ఈ రాష్ట్ర ప్రజలకు పెద్దగా తెలియ దు. కేవలం కడపకు మాత్రమే పరిమితం. అది కూడా పులివెందుల రాజంపేట నియోజకవర్గాలకు మాత్ర మే విమల పేరు పరిచయం. అలాంటి విమలారెడ్డి గత ఆరు మాసాలుగా మీడియా ముందుకు వస్తున్నా రు. చర్చిల్లో ప్రార్థనలు కూడా చేస్తున్నారు. ఇదంతా ఎందుకు? అనేది ఆసక్తికర ప్రశ్న. సమాధానం కూ డా దాదాపు అందరికీ తెలిసిందే.
వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరి విమలారెడ్డి. ఈ కుటుంబంలో పుట్టిన ఏకైక ఆడపడుచు. అయితే.. కొన్నాళ్లుగా వివేకానందరెడ్డి హత్య వ్యవహారం కడప ఎంపీ అవినాష్ రెడ్డి చుట్టూ ముసురుకున్న దరిమిలా.. ఆయన ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న దరిమిలా విమలా రెడ్డి బయటకు వచ్చారు. మరీ ముఖ్యంగా వివేకా కుమార్తె సునీత మీడియా ముందుకు వచ్చి.. తమ ఆవేదనను వెళ్లగక్కారు. ఈ హత్య ప్రీప్లాన్డ్ అని .. కుటుంబ సభ్యులే దీని వెనుక ఉన్నారని సునీత ఆరోపించారు.
ఈ ఆరోపణల దరిమిలా.. ఆరు మాసాల కిందట తొలిసారి విమలారెడ్డి మీడియా ముందుకు వచ్చారు. అ దేం లేదు.. సునీతకు ఏమీ తెలియదు అంటూ.. ఆమె వ్యాఖ్యానించారు. ఆ తర్వాత.. వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపించాలంటూ.. చర్చిల్లో పాస్టర్లను కలిసి ప్రత్యేక ప్రార్థనల పేరుతో రాజకీయాలు చేశారనే విమర్శలు ప్రతిపక్షాల నుంచి వినిపించాయి. ఇక, ఇప్పుడు షర్మిల, సునీతలు చేస్తున్న ఎన్నికల ప్రచారంపైనా.. తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వారి వ్యాఖ్యలు వింటే తన బీపీ పెరిగిపోతోందని వ్యాఖ్యానించారు.
ఈ పరిణామాలను గమనిస్తే.. ఒక్క విషయం తేటతెల్లం అవుతోంది. షర్మిల, సునీతలు చేస్తున్న విమర్శ లు, వ్యాఖ్యలపై సీఎంజగన్ కానీ, ఆయన సతీమణి కానీ నేరుగా రియాక్ట్ అయితే.. ఈ విమర్శలు-ప్రతి విమర్శలు మరింత పెరుగుతాయి. పైగా ప్రజల్లోనూ మరింత చర్చగా మారుతుందనేది వైసీపీ అధినేత అంచనా వేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే.. చేతికి మట్టి అంటకుండా.. మేనత్త అయిన విమలారెడ్డిని ముందు పెట్టి.. ఇలా మీడియాతో మాట్లాడిస్తున్నారని.. షర్మిల, సునీతలపై దుమ్మెత్తిపోసేలా ప్రయత్నిస్తు న్నారని అంటున్నారు ప్రతిపక్షాల నాయకులు.
నిజానికి వివేకంపై ప్రేమ ఉన్న విమలా రెడ్డి(ఆమే చెప్పారు) ఎలాంటి తప్పు లేకుండానే అవినాష్‌ను సీబీఐ ఎందుకు అరెస్టు చేసిందో.. కనీసం ఐదేళ్లుగా ఈ కేసు విచారణ ఎందుకు ఆలస్యమవుతోందో.. ఈ కేసులో నిందితులను తప్పించేందుకు సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారన్న వాదనను ఎందుకు గమనించలేక పోతున్నారో.. అనే విషయాలపైనా మాట్లాడి ఉంటే.. ఆమె విజ్జతను ప్రతి ఒక్కరూ అర్ధం చేసుకునేవారు. కానీ, ఇలా ఏకపక్షంగా అధికార పార్టీ కాడిని మోసుకుంటూ పోతే.. విమలపై ఇప్పటి వరకు ఉన్న పులివెందుల వాసుల విశ్వాసం కూడా సన్నగిల్లే అవకాశం ఉందని అంటున్నారు ప్రతిపక్ష నాయకులు.