రాజకీయాలు ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు. ఏ నిముషానికి ఏమి జరుగునో.. అన్న విధంగా మార్పులు సహజం. ఇప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనూ ఇలాంటి రాజకీయమే తెరమీదికి వచ్చింది. బీసీల నాయ కుడిగా తక్కువ టైంలోనే మంచి గుర్తింపు పొందిన బోడే రామచంద్రయాదవ్… నూతన పార్టీ భారతీయ చైతన్య యువజన పార్టీని స్థాపించారు. ఈ పార్టీపైనే ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. అది కూడా.. మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డిపైనే పుంగనూరులో రామచంద్రయాదవ్ పోటీ చేస్తున్నారు.
బీసీవై.. స్థాపన వెనుక బీసీల అభ్యున్నతి.. వారి హక్కులను ప్రధానంగా రామచంద్రయాదవ్ ప్రస్తావిస్తు న్నారు. రాష్ట్రంలో గత ఐదేళ్ల కాలంలో బీసీలకు జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, వారిపై నమోద వుతున్న కేసులపై ఆయన పెద్ద ఉద్యమమే చేస్తున్నారు. ముఖ్యంగా పుంగనూరును ఆయన టార్గెట్ చేసుకున్నారు. ఈ నియోజకవర్గంలో అప్రకటిత నియంతృత్వం కొనసాగుతోందనేది ఆయన ప్రధాన వాదనగా ఉంది. అంతేకాదు.. కనీసం ప్రతిపక్షాలు నోరు ఎత్తలేని పరిస్థితిని తీసుకువచ్చారని పదే పదే చెబుతున్నారు.
ఇటీవల ఎన్నికల కోడ్ రాకముందే.. బీసీల తరఫున గళం వినిపించేందుకు రామచంద్రయాదవ్ ప్రయ త్నించారు. కానీ, ఆయన సభకు , నిరసనకు పోలీసులు అడ్డు పడ్డారు. గతంలోనూ యాదవ్కు అనేక రూపాల్లో అడ్డంకులు సృష్టించారు. ఇది ప్రధాన ప్రచార అస్త్రంగా మార్చుకుని బీసీవై తరఫున యాదవ్ పోటీకి దిగుతున్నారు. యాదవ సామాజిక వర్గమే కాకుండా.. బీసీలు మొత్తంగా కూడా.. ఈయన వెంట నిలిచారు. ఇది ఆయనకు భారీ మైలేజ్ తెచ్చిపెడుతోందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
మరీముఖ్యంగా.. యాదవ్పై కేసులు నమోదు చేయడం.. బీసీలతరఫున మాట్లాడే గళాన్ని అణిచి వేస్తు న్నారనే వాదన బలంగా వినిపిస్తుండడం కూడా యాదవ్కు కలిసి రానుంది. పెద్దిరెడ్డి వర్గం నియోజకవ ర్గంలో సాగిస్తున్న దందాలు, అవినీతిపై ఆయన నిరంతరం పోరాటాలు చేస్తున్నారు. దీంతో బీసీలు అత్యంత తక్కువ సమయంలోనే యాదవ్కు, బీసీవై పార్టీకి కూడా చేరువయ్యారు. మూడేళ్ల క్రితం నియోజకవర్గంలో మహిళలకు పంపిణీ చేసేందుకు యాదవ్ తెచ్చిన 70 వేల పైచిలుకు చీరలను సరైన కారణాలు లేకుండా పెద్దిరెడ్డి సీజ్ చేయించారన్న ప్రచారం ఉంది. ఇప్పుడు అవే చీరలను పెద్దిరెడ్డి నియోజకవర్గంలో పంపిణీ చేస్తూ వాటిని తన ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని యాదవ్ అనుచరులు ఆరోపిస్తున్నారు.
ఇలా ఒకటి రెండు కాదు నియోజకవర్గంలో ఈ ఐదేళ్లలో ఎంతో అరాచకం, అవినీతి రాజ్యమేలిందని.. దీనిని చాలా వరకు రామచంద్ర యాదవ్ బయట పెట్టారనే స్థానిక జనాల్లో చర్చ నడుస్తోంది. ఏదేమైనా పుంగూరులో పెద్దిరెడ్డికి ఇన్నేళ్లలో ఎప్పుడూ లేనట్టుగా వ్యతిరేకత అయితే కనిపిస్తోంది. దీనికి తోడు సొంత జిల్లాలో సొంత పార్టీ నేతలే పెద్దిరెడ్డి తమపై చలాయిస్తోన్న ఆధిపత్యం తట్టుకోలేక ఆయన ఓడిపోవాలని మనస్ఫూర్తిగా లోలోన కోరుకుంటోన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో పుంగనూరులో పెద్దిరెడ్డికి పెను సవాలే ఎదురు కానుంది. ఇక, యాదవ్కు పరోక్షంగా టీడీపీ, జనసేన, బీజేపీల నుంచి కూడా మద్దతు ఉందనే టాక్ వినిపిస్తోంది. ఇవన్నీ కలిసి పెద్దిరెడ్డి హవాకు ఈ సారి ఖచ్చితంగా బ్రేకులు పడే ఛాన్సులు కనిపిస్తున్నాయి.