. పోలీసుల ఆంక్షల వలన వినూత్నంగా ఇంటింటికి తిరిగి సంక్రాంతి కానుక అందచేత
. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో 10 వేల మందికి చంద్రన్న సంక్రాంతి కానుకను అందచేసిన మన్నవ మోహనకృష్ణ ఛారిటబుల్ ట్రస్ట్
. చంద్రబాబు స్ఫూర్తితో మన్నవ మోహనకృష్ణ మరో భారీ వితరణ
. పండుగ కానుకలు రద్దు చేసి పేదవాడి పొట్టగొడుతున్న జగన్ – రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి మన్నవ మోహనకృష్ణ
పండగ పూట ప్రతి తెలుగింటి లోగిలి సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఆనాడు టీడీపీ ప్రభుత్వం చంద్రన్న కానుక పేరుతో సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ పర్వదినాలను పురస్కరించుకుని పండుగ కానుకలు అందించేదని, వైసీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం పండుగ కానుకులు రద్దు చేసి పేదవాడి పొట్టగొట్టిందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నేత మన్నవ మోహనకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు స్ఫూర్తితో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ నేత మన్నవ మోహనకృష్ణ గతంలో అనేక పండుగలకు చంద్రన్న కానుకలు అందచేశారు. మన్నవ మోహన కృష్ణ ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా తన ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా గుంటూరునగరంలో సంక్రాంతి పండుగ కానుకులు అందించే కార్యక్రమ నిర్వహణకు సిద్ధమైయ్యారు. ఈ నేపథ్యంలో నగర పోలీసులు అనేక ఆంక్షలు విధిస్తూ ఈ కార్యక్రమ నిర్వహణకు అనుమతి నిరాకరించారు. ఇటీవల దసర పండుగ సందర్భంగా కూడా మన్నవ మోహనకృష్ణ చేపట్టిన దసరా చంద్రన్న కానుక పంపిణి కార్యక్రమాన్ని సైతం పోలీసులు పండుగ కిట్ల పంపిణీని అడ్డుకొని ఇదే విధంగా అనుమతి నిరాకరించారు.
ఈసారి పేదవాడికి ఏలాగైన సంక్రాంతి కానుక అందించాలనే లక్ష్యంతో వున్న మన్నవ మోహన కృష్ణ పోలీసులు ఈ కార్యక్రమ నిర్వహణకు అనుమతి నిరాకరించటంతో, వినూత్నంగా మన్నవ మోహన కృష్ణ తానే ఇంటింటికి వెళ్లి చంద్రన్న సంక్రాంతి కానుకలు అందించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని పలు ప్రాంతాలు సందర్శించి సుమారు 10 వేల మందికి పండుగ కానుకను అందజేశారు. ఈ సంక్రాంతి కానుక కిట్లో వివిధ రకాల నిత్యావసర వస్తువులు పొందుపరిచామని మోహనకృష్ణ తెలిపారు. గత పదేళ్లుగా నియోజకవర్గంలోని పేదలకు అనేక సందర్భాల్లో పండుగ కానుకలతో పాటు పెద్దఎత్తున సేవా కార్యక్రమాలు తన మన్నవ మోహనకృష్ణ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేసినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకొని ఈ కార్యక్రమానికి అనుమతి నిరాకరించారు, వాళ్ళు ఈ కార్యక్రమం నిర్వహించటానికి మాకు అనుమతి ఇవ్వకపోవటంతో మేమే ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లి ఈ కానుకలు అందచేశాము” అని మన్నవ మోహన కృష్ణ తెలిపారు.