నిన్న రాత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాంహౌస్ లోని బాత్ రూంలో కాలు జారి పడ్డారు. కాలుజారి పడటంతో కేసీఆర్ తుంటి ఎముక విరిగినట్లు గుర్తించిన వైద్యులు చికిత్స అవసరం అని చెప్పినట్లు తెలుస్తోంది.
అర్ధరాత్రి సోమాజీగూడలోని యశోదా ఆస్పత్రిలో చేరిన మాజీ సీఎం కేసీఆర్ కు వైద్యులు పరీక్షలు నిర్వహించిన అనంతరం చికిత్స చేశారు. కేసీఆర్ కు ఒక చిన్న శస్త్రచికిత్స చేయాల్సి రావొచ్చని వైద్యులు చెబుతున్నారు.
మరిన్ని వైద్య పరీక్షలు పూర్తయ్యాక శస్త్రచికిత్సపై నిర్ణయం తీసుకోనున్నట్లు వైద్యులు ప్రకటించారు.
రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. కొద్దిరోజులుగా రేవంత్ సీఎంగా ఉండగా అసెంబ్లీకి రావడానికి కేసీఆర్ కు ఇష్టం లేనట్టు వార్తలు వస్తున్నాయి. ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తారని కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సడెన్ గా ఆయన పడినట్టు వార్తలు రావడం, పైగా తనకు అనుకూలమైన ఆస్పత్రిలో ఆయన చేరడంపై కాంగ్రెస్ శ్రేణులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నాయి.
కేసీఆర్ దగ్గరుండి కట్టించుకున్న ఇంట్లో బాత్ రూంలో జారిపడే సాధారణంగా చేయించుకుని ఉంటాడా,… అని అనుమానాలు వ్యక్తంఅవుతున్నాయి. ఏది ఏమైనా కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలి, మా పాలనలో ప్రజలతో పాటు ఆయన కూడా బాగుండాలని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి.