మిల్కీ బ్యూటీ తమన్నా కెరీర్లో చాలా వరకు ఎవరితోనూ ప్రేమాయణం నడిపినట్లు వార్తలు రాలేదు. ఇటు టాలీవుడ్.. అటు కోలీవుడ్.. మరోవైపు బాలీవుడ్.. ఇలా పలు ఇండస్ట్రీల్లో పని చేసినా ఆమె గురించి ఇలాంటి గాసిప్స్ ఏమీ వినిపించలేదు. కానీ కెరీర్ చరమాంకంలో ఆమె రిలేషన్షిప్ గురించి ఎంత చర్చ జరుగుతోందో తెలిసిందే. హైదరాబాదీయే అయిన బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ఆమె ప్రేమలో ఉన్నట్లుగా ఏడాది నుంచి జోరుగా ప్రచారం జరుగుతోంది.
వీళ్లిద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరిగేస్తున్నారు. ఒక ఫారిన్ ట్రిప్‌కు కూడా జంటగా వెళ్లి తిరిగి రావడం మీడియా కళ్లలో పడింది. కానీ ఎప్పుడు ఈ రిలేషన్షిప్ గురించి అడిగినా కూడా ఇద్దరూ సమాధానాలు దాట వేస్తూనే ఉన్నారు. తమ ప్రేమాయణం గురించి ఓపెన్ కావడం లేదు. తాజాగా విజయ్ వర్మను తమన్నా పేరెత్తకుండా పెళ్లి గురించి అడిగారు మీడియా వాళ్లు.
దానికి అతను తికమక పెట్టే సమాధానమే ఇచ్చాడు. తనను పెళ్లి చేసుకోవడానికి ఏ అమ్మాయీ సిద్ధంగా లేదని వ్యాఖ్యానించాడు విజయ్ వర్మ. తన ఇంట్లో వాళ్లకు కూడా తన పెళ్లి చూడాలని చాలా కోరికగా ఉందని.. ఆమె కొన్నేళ్ల నుంచి ఈ విషయంలో పోరు పెడుతోందని విజయ్ చెప్పాడు.
తన తల్లి తరచుగా పెళ్లి గురించి అడుగుతూ ఉంటుందని.. కానీ ఆమెకు ఏం సమాధానం చెప్పాలో తెలియడం లేదని.. మీడియా వాళ్లకు కూడా తాను ఈ విషయంలో సమాధానం చెప్పలేనని విజయ్ అన్నాడు. విజయ్, తమన్నా కలిసి ‘లస్ట్ స్టోరీ-2’ సిరీస్ కోసం పని చేశారు. అందులో వాళ్లిద్దరి కెమిస్ట్రీ, ఇంటిమేట్ సీన్లు ఒక రేంజిలో ఉంటాయి. ఆ సిరీస్ ప్రమోషన్ల టైంలో ఇద్దరూ చాలా క్లోజ్‌గా ఉన్నారు. ఈ మధ్య మీడియా కంట్లో పెద్దగా పడట్లేదు. మరి కావాలనే గోప్యత పాటిస్తున్నారా.. లేక ఇద్దరి మధ్య దూరం పెరిగిందా అన్నది తెలియదు.