వరికపూడిశెల- ఇది పల్నాడుజిల్లాలోని ఎత్తిపోతల ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణంతో వెల్దుర్తి, దుర్గి, బొల్లా పల్లి, పుల్లల చెరువు, కారంపూడి మండలాల ప్రజలకు తాగు నీరు, లక్షల ఎకరాలకు సాగు నీరు అంద నుంది. అయితే.. ఈ ప్రాజెక్టు ఇప్పటి వరకు స్థానికులకు అందని మావిగానే మారింది. . ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంత ప్రజలకు కలగా మిగిలిన వరికపూడిసెల ప్రాజెక్టు అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ రాజకీయ పక్షాలకు ప్రధాన ప్రచారాస్త్రం.
ఇక, ఈ ప్రాజెక్టును కడతామంటూ.. ఎన్నికలకు నాలుగు మాసాల ముందు.. వైసీపీ అదినేత, ఏపీ సీఎం జగన్ బయలుదేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు(బుధవారం) పల్నాడు జిల్లా మాచర్లలో పర్యటిస్తున్నారు. ఇక్కడి ప్రజల చిరకాల కోరికైన వరికపూడిసెల ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారని.. ప్రభుత్వం భారీ ఎత్తున ప్రకటనలు గుప్పించింది. అంతేకాదు.. పల్నాడు జల ప్రదాయని కానుందని కూడా పేర్కొంది.
ఇక, మొత్తం 320 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ఈ ఎత్తిపోతల పథకం తొలిదశలో 24 వేల 900 ఎకరా లకు సాగునీరు అందనుంది. అయితే.. ఇప్పుడుజరుగుతున్నది కేవలం శిలా పలకం ఏర్పాటు( శంకుస్థా పన) మాత్రమే. మరి ప్రాజెక్టు ఎప్పుడుపూర్తవుతుంది? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. అయితే.. ఇలాంటి ప్రాజెక్టులు చాలానే ఉన్నాయి.
మరోవైపు.. వరికపూడిశెల ప్రాజెక్టు కోసం.. ఇక్కడి ప్రజలు సుదీర్ఘంగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో నే 2006లో అప్పటి సీఎం, ప్రస్తుత సీఎం తండ్రి.. వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా శంకుస్థాపన చేశారు. ఇంకే ముంది.. మళ్లీ 2009 ఎన్నికల నాటికి ఈ ప్రాజెక్టును కట్టిన తర్వాతే.. ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకువస్తామ ని కూడా ఆయన శిలా ఫలకం ఆవిష్కరించే రోజు చేసిన ప్రసంగంలో చెప్పుకొచ్చారు.
అయితే.. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా పడలేదు. ఇక, ఇప్పుడు మరోసారి వైఎస్ తనయుడు, ప్రస్తుత సీఎం మరోసారి ఇదే ప్రాజెక్టుకు శంకు స్థాపన చేస్తున్నారు. మరి ఎప్పటికి పూర్తి చేస్తారో చూడాలి. ఇదిలావుంటే.. నాటి ఘటనలను ప్రస్తుతం గుర్తు చేసుకుంటూ.. “అప్పట్లో తండ్రి-ఇప్పుడు కొడుకు“ అంటూ.. స్థానికులు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.