టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై మంత్రి అంబటి రాంబాబు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు, లోకేష్ ఇద్దరు వేల కోట్లు దోచుకున్నారని, ఆధారాలున్నాయి కాబట్టే చంద్రబాబును అరెస్ట్ చేశారని అన్నారు. తండ్రిని అరెస్ట్ చేస్తే లోకేష్ భార్యా పిల్లలను వదిలి ఢిల్లీ పారిపోయారని విమర్శించారు. ఈ నేపథ్యంలోనే అంబటికి మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు.
‘అరగంట కోసం’ కాదుగా సోంబేరి సారు’ అంటూ అంబటికి అయ్యన్న ఇచ్చిన కౌంటర్ వైరల్ అయింది. చంద్రబాబు అరెస్ట్ తర్వాత లోకేష్ ఢిల్లీలోల లాయర్లతో భేటీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కోర్టు వ్యవహారాలను చూసుకునేందుకు లోకేష్ చాలా రోజులు ఢిల్లీలో ఉన్నారు. ఆ క్రమంలోనే లోకేష్ పై వైసీపీ నేతలు విమర్శలు గుప్పించడం మొదలుబెట్టారు. అయితే, ఆ వ్యాఖ్యలకు లోకేష్ ఎప్పుడో దీటుగా సమాధానమిచ్చారు. తాను ఉంటున్న అడ్రస్ చెప్పి తాను ఎక్కడికీ పారిపోలేదని కౌంటర్ ఇచ్చారు.