టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. అంగళ్లు, ఏపీ ఫైబర్ గ్రిడ్, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులలో ముందస్తు బెయిల్ పిటిషన్లను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. వేర్వేరుగా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను జస్టిస్ కే సురేష్ రెడ్డి డిస్మిస్ చేస్తూ తీర్పునిచ్చారు. దీంతో, ఈ రోజు మధ్యాహ్నం చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విజయవాడలోని ఏసీబీ కోర్టు వెలువరించనున్న తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది. ఈ కేసులో విచారణలు ముగియగా..తీర్పును హైకోర్టు రిజర్వలో పెట్టింది.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏసీబీ కోర్టు చంద్రబాబుకు బెయిల్ వస్తుందా లేదా అన్న టెన్షన్ టీడీపీ కార్యకర్తలు, నేతల్లో మొదలైంది. అంగళ్లు కేసులో నిందితులందరికీ బెయిల్ రావడంతో చంద్రబాబుకు కూడా బెయిల్ వస్తుందని అంతా భావించారు. మరోవైపు, సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై ఈ రోజు విచారణ జరగనుంది. అక్కడైనా చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై అనుకూలంగా తీర్పు వస్తుందని టీడీపీ నేతలు ఆశిస్తున్నారు.