టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రస్తుతం ఉమ్మడి కృష్ణా జిల్లాలో కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ప్రకాశం బ్యారేజి వద్ద లోకేష్ కు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. వేలాది మంది టీడీపీ కార్యకర్తలు లోకేష్ బాబుకు ఆహ్వానం పలికేందుకు ప్రకాశం బ్యారేజీ వద్దకు చేరుకున్నారు. దీంతో, ఈ ప్రాంతమంతా తెలుగు తమ్ముళ్ల కేకలు, ఈలలు, గోలతో దద్దరిల్లిపోయింది.
ఇక, 2 కిలోమీటర్ల మేర ప్రకాశం బ్యారేజ్ పై పసుపు రంగు ప్రభంజనం కనిపించింది. కనకదుర్గమ్మ ఆశీస్సులతో కృష్ణమ్మ చల్లని చూపులు నడుమ ప్రకాశం బ్యారేజీ మీదుగా లోకేష్ విజయవాడలో అడుగుపెట్టారు. ప్రకాశం బ్యారేజీ కింద కృష్ణమ్మ జల ప్రవాహం…బ్యారేజీ పైన తెలుగు తమ్ముళ్ల జన ప్రవాహం మధ్య యువగళం పాదయాత్ర నభూతో నభవిష్యత్ అన్నరీతిలో కొనసాగింది. ఒకవైపు బ్యారేజీపై పసుపు జెండాలు రెపరెపలాడుతుండగా…మరోవైపు బ్యారేజీ కింద పడవలపై కూడా పసుపు సైన్యం లోకేష్ కు ఘన స్వాగతం పలికింది.
దాదాపు 150 పడవలపై తెలుగు తమ్ముళ్లు యువగళం జెండాలు, టీడీపీ జెండాలతో లోకేష్ కు స్వాగతం పలికారు. లోకేష్ రాకతో ప్రకాశం బ్యారేజీ దద్దరిల్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
యువగళం పాదయాత్రకు కృష్ణా జిల్లా ఘన స్వాగతం పలికింది. కనకదుర్గమ్మ ఆశీస్సులు అందించగా, కృష్ణవేణి చల్లని చూపులు ప్రసరించగా ప్రకాశం బ్యారేజీ మీదుగా జనప్రవాహమై సాగింది యువగళం.#YuvaGalamPadayatra #AndhraPradesh pic.twitter.com/AF8gMSaEp5
— Lokesh Nara (@naralokesh) August 19, 2023
కృష్ణమ్మ ఆశీసులు, దుర్గమ్మ దీవెనెలతో, ఆశేష జనవాహిని మధ్య, విజయవాడలో అడుగుపెట్టిన నారా లోకేష్#LokeshinVijayawada #YuvaGalamPadayatra #YuvaGalam#LokeshPadayatra #NaraLokesh#NaraLokeshForPeople#yuvagalamlokesh#AndhraPradesh pic.twitter.com/iHdEDkJ3kg
— Telugu Desam Party (@JaiTDP) August 19, 2023
2 కిమీ మేర ప్రకాశం బ్యారేజ్ పై జన ప్రభంజనం. గుంటూరు జిల్లా నుంచి కృష్ణా జిల్లాలోకి నారా లోకేష్ యువగళం ప్రవేశం#LokeshinVijayawada #YuvaGalamPadayatra #YuvaGalam#LokeshPadayatra #NaraLokesh#NaraLokeshForPeople#yuvagalamlokesh#AndhraPradesh pic.twitter.com/TRmstmltfF
— Telugu Desam Party (@JaiTDP) August 19, 2023