క్రికెటర్ గా సుపరిచితుడైన రాయుడు వైసీపీలో చేరనున్న వార్తలు రావటం తెలిసిందే. ఇప్పటికే రెండు..మూడు సార్లు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ కావటం.. ఎన్నికల్లో పోటీకి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా రాజకీయ వర్గాల వాదన. అయితే.. ఈ విషయాన్ని అధికారికంగా వైసీపీ కానీ.. రాయుడు కానీ వెల్లడించింది లేదు. తాజాగా గుంటూరు జిల్లా ఫిరంగిపురానికి వెళ్లారు. అక్కడ మీడియాతో మాట్లాడారు.
ఈ మధ్యనే ఐపీఎల్ కు గుడ్ బై చెప్పిన ఈ క్రికెటర్.. ప్రస్తుతానికి ప్రజలకు సేవ చేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రైతుల సమస్యల మీద ఆసక్తిని వ్యక్తం చేస్తూ.. వారు ఎదుర్కొంటున్న ఇబ్బందుల మీద అధ్యయనం చేస్తున్నారు. అయితే.. ఆయన గుంటూరు ఎంపీగా వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారన్న మాట బలంగా వినిపిస్తోంది. అయితే.. ఈ వాదనను అంబటి రాయుడు కొట్టి పారేస్తున్నారు. ప్రస్తుతానికి తాను ఎన్నికల్లో పోటీ చేయటం అన్నది ఊహాజనితమైన అంశంగా కొట్టిపారేస్తున్న ఆయన.. ఎన్నికల్లో పోటీ గురించి తాను ఆలోచించటం లేదని చెప్పటం గమనార్హం.
ఇప్పటికే సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పోస్టులు పెడుతున్న రాయుడ తీరుతో ఆయన వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేయటం పక్కా అన్న మాట వినిపిస్తోంది. అయితే.. ఈ వాదనను రాయుడు కొట్టి పారేస్తున్నారు. ఇధిలా ఉంటే.. అతడికి ఎంపీ సీటు ఇవ్వనున్నట్లుగా ఓవర్గం ప్రచారం చేస్తుంటే.. అదేమీ కాదు ఆయన్ను అసెంబ్లీ ఎన్నికల బరిలో దింపే వీలుందంటున్నారు. గుంటూరు అసెంబ్లీనుంచి రాయుడు బరిలోకి నిలుస్తారన్న ప్రచారం జరుగుతోంది. మరేం జరుగుతుందో కాలమే నిర్ణయించాలి.