రాష్ట్రంలో పులివెందుల రాజకీయం నడుస్తోందని.. ఎక్కడికక్కడ దందాలు.. దౌర్జన్యాలు.. రౌడీయిజం పెరిగిపోయిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని నుంచి బయట పడేందుకు జనాల్లోనే మార్పు రావాలని ఆయన సూచించారు.
తాజాగా ఆదివారం ఆయన కోనసీమ జిల్లాలోని రాజోలు నియోజకవర్గంలో వారాహి యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా తొలుత నియోజకవర్గ జనసేన నేతలు, ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పులివెందుల రాజకీయం సాగుతోందని చెప్పారు.
గోదావరి జిల్లాల నుంచే రాష్ట్ర రాజకీయాల్లో మార్పు రావాలని పవన్ అన్నారు. నేరగాళ్లు రాజకీయాలు చేస్తే రాష్ట్రం నాశనం అవుతుందని అన్నారు. కులం ఆధారంగా రాజకీయాలు చేయలేమని ఆయన చెప్పారు. “మన ఓట్లు తీసేసి దొంగ ఓట్లు వేస్తారు జాగ్రత్త“ అని పవన్ హెచ్చరించారు.
వారాహి యాత్ర 12వ రోజు ఆదివారం కోనసీమ జిల్లాలో కొనసాగుతోంది. ఆదివారం రాజోలు నియోజకవర్గంలో తన పార్టీ నాయకులతో, కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా వారికి దిశా నిర్దేశం చేశారు. రాజోలులో వెలిగించిన చిన్నదీపం రేపు రాజంపేటలోనూ వెలుగుతుందని అన్నారు.
ఈ సందర్భంగా రాజకీయ అవినీతి నిర్మూలనపై మాట్లాడిన పవన్.. రూ.2 వందలు లంచం తీసుకున్న ఉద్యోగికి శిక్ష పడుతుంది కానీ, వేల కోట్లు దోపిడీచేసే నేతలు అధికారంలో ఉంటూ పరిపాలన చేస్తున్నారని పరోక్షంగా జగన్పై విమర్శలు గుప్పించారు.
నేరగాళ్లు రాజకీయాలు చేస్తే రాష్ట్రం నాశనం అవుతుందని అన్నారు. కులం ఆధారంగా రాజకీయాలు చేయలేం అని స్పష్టం చేశారు. గోదావరి జిల్లాల నుంచే మార్పు మొదలు కావాలని సూచించారు. పులివెందుల సంస్కృతి అన్నిచోట్లకూ తెచ్చారని ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ మండిపడ్డారు.
రాజకీయ పదవుల్లో మూడోవంతు మహిళలు ఉండాలని, దీనికి జనసేన కట్టుబడి ఉందని.. వచ్చే ఎన్నికల్లోనే దీనిని చేసి చూపిస్తామని పవన్ తెలిపారు. ప్రజల హక్కులకు భంగం కలిగితే పోరాడతామని చెప్పారు. మన ఓటుతో గెలిచి జవాబుదారీతనం లేకపోతే కుదరదని, అలాంటి నాయకులను జైళ్లకు పంపించాలని వ్యాఖ్యానించారు. మన ఓట్లు తీసేస్తారు.. దొంగ ఓట్లు వేస్తారు.. జాగ్రత్త.. కులాల సర్దుబాటు కోసమే కుల ప్రస్తావన తప్ప రెచ్చగొట్టేందుకు కాదని పవన్ స్పష్టం చేశారు.
25 lakhs insurance plan for each family @PawanKalyan ????#VarahiVijayaYatra pic.twitter.com/udsywTPRnV
— PawanKalyan Army (@PawanKalyanArmy) June 25, 2023
This is the quality a leader should have..
Proud of you annayya @PawanKalyan
A lady met him during 2019 election campaign
He still remembered her details n mentioned what she wrote..
అందరి రాజకీయనాయకుల లాగా పేపర్ లు తీసుకొని మీటింగ్ అవ్వగానే చెత్త బుట్టలో పడేసే రకం కాదు ..… pic.twitter.com/pxKPOHjA8J
— Kasirao JanaSena (@KasiraoJSP) June 25, 2023