“ఒకే పోలీసు స్టేషన్.. ఒకే తరహా ఆత్మహత్యలు.. ఒకే తరహా పోలీసుల వేధింపులు. వీటికి సీఎం జగనే బాధ్యుడు“ అని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాలలో దళిత యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఏపీలో పరిస్థితులపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో బడుగుల హత్యలు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. నంద్యాలలో దళిత యువకుని ఆత్యహత్య వ్యవస్థ చేసిన హత్యే అని విమర్శలు గుప్పించారు.
‘‘వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ నేరాంధ్రప్రదేశ్‌గా మారిపోయింది. వ్యవస్థలు చేస్తున్న హత్యలకు బడుగులు బలవుతున్నారు. దొంగతనం నేరం మోపి పోలీసులు వేధించడంతో నంద్యాలలో చిన్నబాబు అనే దళిత యువకుడు ప్రాణాలు తీసుకోవడం అత్యంత బాధాకరం. ఏ పోలీసులు అయితే వేధిస్తున్నారని 2020 నవంబర్‌లో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిందో.. అదే పోలీస్ స్టే
రక్షణ ఇవ్వాల్సిన పోలీసుల వల్లే వ్యక్తులు ప్రాణాలు పోయే పరిస్థితుల్లోకి రాష్ట్రాన్ని తీసుకువెళ్లారని అన్నారు. నంద్యాల ఘటనలో బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, దీనికి జగన్ బాధ్యత వహించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. బాధ్యులపై పోలీసులు కేసు నమోదు చేయాలని చంద్రబాబు వ్యాఖ్యానిం