కొన్ని కొన్ని విషయాలు చిత్రంగా ఉంటాయి. ఏ ప్రభుత్వానికైనా.. కూడా అధికారులు అత్యంత కీలకం. గత చంద్రబాబు హయాంలో పని ఎక్కువగా చేయించారని.. పరుగులు పెట్టించారని ఒక వాదన నడిచింది. దీంతో అధికారుల నుంచి ఉద్యోగుల వరకు కూడా.. ఎన్నికల సమయంలో ఒకింత వ్యతిరేకత చూపారనేది టీడీపీ నేతలు వేసిన అంచనా. అయితే.. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో గోడ దెబ్బ చెంప దెబ్బ అన్నట్టుగా అధికారుల పరిస్థితి మారిపోయింది.
“గతంలోనే నయం. అంతో ఇంతో స్వేచ్ఛ ఉండేది“ అని ఒకసీనియర్ అధికారి చేసిన కామెంట్ జగన్ సర్కారుపై అధికారుల ఆగ్రహానికి పరాకాష్టగా మారింది. దీనికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి. క్షేత్రస్థా యిలో పని చేయించుకోవడంలోచంద్రబాబు పైకి కనిపించేవారు. అయితే.. జగన్ ఆయనకన్నా రెండాకు లు ఎక్కువ చదివినట్టుగా.. చేయిస్తున్నారు. అయితే, పైకి మాత్రం కూల్‌గా ఉంటున్నారు.ఇక, కొందరు అధికారులు చెప్పినట్టు చంద్రబాబు వినేవారు.
వాటిలో మంచి ఉంటే తప్పకుండా పరిశీలించేవారు. కానీ జగన్ హయాంలో అలాంటిదేమీ లేదని.. అధికా రులు బయటకు చెప్పేస్తున్నారు. జగన్ పాలనలో ఆయన చేతి కింద పనిచేసిన.. ఎల్వీ సుబ్రహ్మణ్యం కావొచ్చు.. ఇతర అధికారులు ఒకరిద్దరు కావొచ్చు.. బయటకు వచ్చాక సర్కారుపై విమర్శలు చేస్తున్న వైనం మనకు కనిపిస్తున్నదే. అదేసమయంలో జీతాలు సరిగా ఇవ్వడం లేదని సిబ్బంది గగ్గోలు పెడుతు న్న విషయం కూడా తెలిసిందే.
ఈ పరిస్తితి గత టీడీపీ ప్రభుత్వంలో మనకు కనిపించలేదు. అదికారులు కూడా ఎవరూ ఇలా బయటకు వచ్చి అసంతృప్తి వ్యక్తం చేసింది కూడా లేదు. ఇక, గతానికి ఇప్పటికి ఉన్న మరో కీలక తేడా.. హైకోర్టు నుంచి తీవ్ర విమర్శలు.. జైలు శిక్షలు! ఏకంగా.. జగన్ హయాంలో చేసిన ప్రతి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శినీ.. డీజీపీని హైకోర్టు పిలిచింది. గతంలో ఉన్నవారు.. ఇప్పుడు ఉన్నవారు. కూడా హైకోర్టు మెట్టెక్కినవారే కావడం గమనార్హం. ఈ పరిణామం.. అధికారులను రగిలిస్తోందన్నది.. తాజాగా ఐప్యాక్ చేసిన సర్వేలో తేలింది. ఇది ముదిరితే.. ఎన్నికల సమయానికి ఇబ్బందులు తప్పవని ఒక అంచనా..!