#PVR + #INOX deal was not about consolidation of #BoxOffice market share…it was about addition of MRP of the popcorn from both the multiplex and abuse of their dominant position…@CCI_India please take note. pic.twitter.com/2PLb4v5vAf
— Harikrishna Ramineni (@Cherry_Harish) April 29, 2023
సీనియర్ దర్శకుడు తేజ ఏం మాట్లాడినా కుండబద్దలు కొట్టినట్లే మాట్లాడతాడు. ఆయన మాటలు చాలా ఆలోచనాత్మకంగానూ ఉంటాయి. సినీ రంగంలో పోకడల మీద ఆయన తనదైన శైలిలో విశ్లేషిస్తుంటారు. కఠిన వాస్తవాలను కళ్లకు కట్టినట్లు చెబుతుంటారు. తాజాగా హీరో గోపీచంద్ కొత్త సినిమా రామబాణం ప్రమోషన్లలో భాగంగా ఆయన అతడితో ఒక ఇంటర్వ్యూ చేశారు. అందులో ఆయన మల్టీప్లెక్సుల్లో పాప్ కార్న్, ఇతర తినుబండారాల ధరల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అక్కడ అసాధారణంగా ఉండే పాప్ కార్న్ రేట్ల వల్లే జనాలు థియేటర్లకు రావడం మానేస్తున్నారని.. పాప్ కార్న్ సినిమాను చంపేస్తోందని స్టేట్మెంట్ ఇచ్చారు.
ఓటీటీలు, టీవీల వల్ల సినిమాకు వచ్చిన ముప్పు ఏమీ లేదని.. అవి సినిమాను దెబ్బ తీస్తాయంటే తాను నమ్మనని తేజ తేల్చి చెప్పారు.
థియేటర్‌కు వచ్చే ప్రేక్షకుడు పాప్ కార్న్, సమోసాల్లాంటివి కొనుక్కుని అవి తింటూ సినిమాను ఆస్వాదించాలని కోరుకుంటాడని… ఐతే మల్టీప్లెక్సుల్లో వాటి ధరలు అమాంతం పెంచేయడం వల్ల జనాలు సినిమాలకు రావడమే మానేస్తున్నారని తేజ అన్నారు.
టికెట్ల ధరల కంటే పాప్ కార్న్ ధరలు ఎక్కువ ఉండటం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉత్తరాదిన హిందీ సినిమాలకు వసూళ్లు పడిపోవడానికి అక్కడ మల్టీప్లెక్సులు ఎక్కువైపోయి, పాప్ కార్న్ ధరలు అసాధారణంగా పెరగడమే కారణమని తేజ అభిప్రాయపడ్డారు. మన దగ్గర కూడా మల్టీప్లెక్సులు పెరిగే కొద్దీ సినిమా చచ్చిపోతుందని ఆయన అన్నారు.
సింపుల్‌గా పాప్ కార్న్ సినిమాను చంపేస్తుందని తన అభిప్రాయం అని తేల్చేశారు తేజ. జనాలు మల్టీప్లెక్సులకు వెళ్లకుండా సింగిల్ స్క్రీన్లకే వెళ్లాలని తేజ సూచించారు. తేజ మంచి మాట చెప్పారని.. దీని గురించి ఆలోచించాలని దర్శకుడు హరీష్ శంకర్ ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు.
Even single screen sells puffs, small chips and popcorn packets at 40/-
Ticket emo 150-175 undi and water bottle + puff konte 80 ayitundi okariki. 4 unna Family pothe 1100+. Inga multiplex antara ????????????
Family audience ni slow ga OTT side nukutundi ee popcorn business eyy ???? https://t.co/5uvs2gW0fx
— Prakash – ప్రకాశ్ – प्रकाश (@saireddy95) April 29, 2023
Buying Pop Corn in a multiplex : pic.twitter.com/ut5JejYBao
— Raj (@Gandhi_Baat_) April 4, 2022