ఏపీలో టీడీపీ అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు భృతి ఇస్తానని మాజీ సీఎం చంద్రబాబు ప్రకటించారు.
ఉద్యోగాలు కూడా ఇస్తామన్నారు. సీఎం జగన్ ఒక తిక్క శంకరయ్య అని ఎద్దేవా చేశారు. అందుకే రోజుకో శంకుస్థాపన అంటూ డ్రామాలు ఆడుతున్నాడన్నారు.
ఇంటికి పోయే రోజులు దగ్గరపడి తిక్కతిక్క పనులన్నీ చేస్తూ కులమతాలను రెచ్చగొట్టాలని చేస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ను చంద్రబాబు తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు.
ప్రకాశం జిల్లా, మార్కాపురంలో గురువారం రాత్రి నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించా రు. ఐదేళ్ల క్రితం భోగాపురం ఎయిర్పోర్టుకు శంకుస్థాపన చేశానన్నారు.
అయితే.. ఇప్పుడు మరోసారి సీఎం జగన్ శంకుస్థాపన చేశాడని ఎద్దేవా చేశారు.
రాజశేఖరరెడ్డి వదిలేసిన కడప స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి తాను శంకుస్థాపన చేస్తే జగన్ మళ్లీ రెండుసార్లు చేశాడని విమర్శించారు.
జగన్కు పిచ్చి ముదిరి సెప్టెంబరులో విశాఖ వెళ్తానని చెబుతున్నాడని దుయ్యబట్టారు.
ఆయన్ను విశాఖ కాకుండా ఇడుపులపాయకు పంపాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
తన తండ్రి హంతకులను తేల్చాలనే దృఢసంకల్పంతో సునీతారెడ్డి ముందుకుపోతుంటే ఆ కేసులో అనేక అడ్డంకు లకు కారణభూతుడవుతున్నాడని విమర్శించారు.
సినిమాల్లో కూడా లేని సీన్స్ సృష్టిస్తున్నాడన్నారు.. జగనన్న బాణం అంటూ తిరిగిన చెల్లెలు ఎక్కడకు పోయిందో అందరికీ తెలుసని అన్నారు.
చివరకు వైసీపీ పార్టీకి గౌరవ అధ్యక్షురాలు తల్లి విజయలక్ష్మికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పలేకపోయాడని, తల్లికి శుభాకాంక్షలు చెప్పలేని కొడుకు ఒక కొడుకేనా..? అని చంద్రబాబు నిలదీశారు.
ఉద్యోగాలు ఇవ్వ మని యువకులు అడుగుతుంటే గంజాయి ఇస్తున్నాడన్నారు.
గంజాయి కల్చర్, గన్ కల్చర్, రౌడీయిజం రాష్ట్రంలో పెరిగిపోయాయని చంద్రబాబు విమర్శలు గుప్పించారు.
తాను అధికారంలోకి వచ్చాక.. వీటి భరతం పడతానన్నారు.