బే ఏరియా తెలుగు అసోసియేషన్ బాటా(BATA) ఆధ్వర్యంలో సంగీత కచేరి జరిగింది. ఇటీవల మరణించిన దిగ్గజ దర్శకుడు కె విశ్వనాథ్, ప్రముఖ సినీ గాయని వాణీ జయరాం, దిగ్గజ నటి జమున గార్ల స్మారకార్థం ఈ సంగీత విభావరిని బాటా నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఆ ముగ్గురి సినిమాల నుంచి సూపర్ హిట్ పాటలను ఎంచుకొని ఈ కచేరిలో గాయకులు అద్భుతంగా ఆలపించారు. దిగ్గజ గాయకుడు, గాన గంధర్వ ఘంటసాల మాస్టారు గారి 49వ వర్ధంతి సందర్భంగా కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
కృష్ణ రాయసం, శ్రీధర్ గానపాటి, అనికా ప్రసాద్, మాల తంగిరాల, మాధవ్ దంతుర్తి, విజయ గోపరాజు, శ్రీని తగిరిస, తిరుమలేష్, అనురాధ, ప్రేమ్ సాయి కార్తీక్, స్నేహ చతుర్వేదుల, శ్రీదివ్య యలమంచి, చేతన్ వాకాడే, గిరీష్ కులకర్ణి, గుర్మేల్ సింగ్, జీవన్ జుట్షి, ఆన్య, ప్రభాకర్, శ్రీ, నాగేష్ వై, హేమ్ కుమార్, పొన్ని స్వామినాథ్ తదితర గాయనీగాయకులు తమ అద్భుతంగా పాటలు పాడి అలరించారు. దాంతోపాటు, ఆ ముగ్గురితో తమకున్న అనుబంధాన్ని, జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
గత 13 సంవత్సరాల నుండి బాటా మ్యూజికల్ గ్రూప్ విజయవంతంగా నడుపుతున్నామని ప్రసాద్ మంగిన చెప్పారు. ప్రతిభావంతులైన యువ గాయనీగాయకులు తమను తాము నిరూపించుకోవడానికి బాటా మ్యూజికల్ గ్రూప్ ఒక చక్కని వేదిక అని ప్రసాద్ చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారికి, గాయనీగాయకులకు ప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు.
బాటా ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు హరినాథ్ చికోటి(అధ్యక్షులు), కొండల్ కొమరగిరి(వైస్ ప్రెసిడెంట్), అరుణ్ రెడ్డి(సెక్రటరీ), వరుణ్ ముక్కా(ట్రెజరర్),
శిక వాడా(జాయింట్ సెక్రటరీ)….స్టీరింగ్ కమిటీ సభ్యులు రవి తిరువీధుల, కామేష్ మల్లా, శిరీషా బత్తుల, యశ్వంత్ కుదరవలి, సుమంత్ పుసులూరి….కల్చరల్ డైరెక్టర్లు శ్రీదేవి పసుపులేటి, శ్రీలు వెలిగేటి, తారక దీప్తి…నామినేటెడ్ కమిటీ సభ్యులు హరి సన్నిధి, సురేష్ శివాపురం, శరత్ పోలవరపు…యూత్ కమిటీ సభ్యులు ఉదయ్, సంకేత్, ఆదిత్య, గౌతమి, హరీష్, సందీప్…బాటా అడ్వైజరీ బోర్డ్ సభ్యులు జయరాం కోమటి, విజయ ఆసూరి, వీరు ఉప్పాల, ప్రసాద్ మంగిన, కరుణ్ వెలిగేటి, రమేష్ కొండా, కల్యణ్ కట్టమూరి తదితరులు…. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసింనందుకు బాటా మ్యూజికల్ గ్రూప్ సభ్యులకు, గాయనీగాయకులను అభినందించారు. ఈ కార్యక్రమానికి కలవెండి ఫౌండేషన్-ITCLA శ్రీనివాస మూర్తి కూడా హాజరయ్యారు.