అది.. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఉన్న బాండీ బీచ్. అప్పుడే తెలతెల వారుతోంది.
బాల భాస్కరుడు.. అప్పుడే కళ్లు తెరిచిన చిన్నారి మాదిరిగా నీలాకాశంలో నెమ్మదిగా ఉదయిస్తున్నాడు.
సాధారణంగా అయితే, అలాంటి సమయంలో అక్కడ పెద్దగా ఎవరూ ఉండరు.
కానీ, ఈ శనివారం మాత్రం అక్కడ ఒక అద్భుతం చోటు చేసుకుంది.
ప్రపంచం మొత్తాన్ని కన్ను మూయనీయని ఘటనను అక్కడ ఆవిష్కరించింది.
అదే.. ఏకంగా.. 2500 మంది నగ్నంగా నిలబడడం!!
స్త్రీ, పురుషులు ఏకంగా 2500 మంది ఒకే చోట.. ఒంటిమీద నూలు కూడా పోగు లేకుండా.. ఒకరినొకరు అంటుకునేలా నిలబడిన దృశ్యాన్ని కొన్ని వందల కెమెరాలు ఒకే సమయంలో షూట్ చేస్తున్నాయి.
దీనికి కారణం ఏంటి? అంటే.. చర్మ క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకే వీరు ఇంత మంది వినూత్న కార్యక్రమం చేపట్టడం.
బీచ్‌లో ఏకంగా 2500 మంది నగ్న ఫోటోషూట్‌లో పాల్గొన్నారు.
దీంతో ప్రపంచవ్యాప్తంగా చర్మ క్యాన్సర్‌పై ఫోకస్ పెట్టాలని పిలుపునిచ్చారు.
ఆస్ట్రేలియాలో చర్మ క్యాన్సర్ బాధితులు ఎక్కువగా ఉన్నారు.
దీంతో, చర్మ క్యాన్సర్‌పై అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో సిడ్నీలో ఉన్న బాండీ బీచ్ వద్ద శనివారం ఉదయం సుమారు 2500 మంది నగ్న ఫోటోషూట్‌లో పాల్గొన్నారు.
చర్మ క్యాన్సర్‌పై అవగాహన కోసమే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు వారు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
కాగా, ఈ వినూత్న కార్యక్రమాన్ని అమెరికా ఫొటోగ్రాఫర్ స్పెన్సర్ టునిక్ ఈ ప్రాజెక్టును చేపట్టారు.
అయితే అక్కడ ప్రజల్లో అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఈ ఈవెంట్ నిర్వహించారు.
ఇదిలా ఉండగా.. బీచ్‌ల్లో నగ్నంగా తిరిగేందుకు ఇటీవలే ఆస్ట్రేలియా ప్రభుత్వం చట్టం చేసింది. దీంతో, వీరికి ఎలాంటి ఇబ్బందీ లేకుండా పోయింది.
ప్రతి ముగ్గిరిలోనూ క్యాన్సర్!
తాజా నివేదిక ప్రకారం ఆస్ట్రేలియాలోని 70 ఏళ్ల వయస్సులోపున్న ప్రతి ముగ్గురిలోనూ ఇద్దరు క్యాన్సర్‌తో బాధపడుతున్నారు.
ఈ సంవత్సరం ఆస్ట్రేలియాలో 17,756 కొత్త చర్మ క్యాన్సర్ కేసులు నిర్ధారణ అవుతాయని, 1,281 మంది ఆస్ట్రేలియన్లు ఈ వ్యాధితో చనిపోతారని ఫెడరల్ ప్రభుత్వం అంచనా వేసింది.
దీంతో చర్మ క్యాన్సర్‌పై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
ఈ నేపథ్యంలో ప్రజలు కొందరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ ఫొటో షూట్లో పాల్గొన్నారు.
ఫొటో షూటర్ ప్రత్యేకత ఇదే
ప్రపంచంలోని ప్రసిద్ధమైన ప్రాంతాల్లో సామూహిక నగ్న ఫోటో షూట్లను ప్రదర్శించడంలో ట్యూనిక్ ఎంతో పేరు పొందాడు.
న్యూయార్క్‌కు చెందిన ట్యూనిక్ ఆస్ట్రేలియాలో నాల్గవ అత్యంత సాధారణమైన క్యాన్సర్ రూపమైన మెలనోమా గురించి అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నాడు.
ఇందులో భాగంగా నేక్డ్ ఆర్ట్ ఇన్‌స్టాలేషన్‌పై స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేశాడు.
2010లో సిడ్నీలో 5,200 మంది ఆస్ట్రేలియన్లు సిడ్నీ ఒపెరా హౌస్‌లో నగ్నంగా పోజులిచ్చినప్పుడు టునిక్ చివరిసారిగా మాస్ షూట్‌కు దర్శకత్వం వహించాడు.