చంద్రబాబు స్పీడు చూస్తుంటే తెలంగాణ పార్టీ కేడర్ లో ఉత్సాహం ఉరకలేస్తోంది. తెలంగాణలో పార్టీపై చంద్రబాబు చాలా ఏళ్ల తర్వాత చాలా కీలకమైన అడుగులు వడివడిగా వేస్తున్నారు.
ప్రతి మనిషి జీవితంలో తప్పులు చేస్తుంటారు. 2004లో ముందస్తుకు పోవడం, కేసీఆర్, జగన్ లను తక్కువ అంచనా వేయడం వంటివి చంద్రబాబు చేసిన కొన్ని కీలక తప్పుల్లో ఒకటి.
అలాగే ప్రతిమనిషి తప్పులు చేస్తారు. కేసీఆర్ తాజాగా చేసిన అలాంటి తప్పుు టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడం. దీనివల్ల మళ్లీ తెలంగాణలో మళ్లీ తెలుగుదేశం కేడర్ పుంజుకోవడానికి పూర్తి అవకాశం దొరికింది. అయితే, ఇక్కడ బాబు పోటీ చేయడం తాత్కాలికంగా కేసీఆర్ కు పరోచ్చంగా ఉపకరించొచ్చు. కానీ దీర్ఘకాలికంగా టీడీపీకి మేలే చేస్తుందన్నది రాజకీయ నిపుణుల విశ్లేషణ.
ఏపీలో బీఆర్ఎస్ రావడం వల్ల టీడీపీ ఓట్లు చీల్చాలని జగన్ భావిస్తుండవచ్చు. కానీ కేసీఆర్ నుంచి ఇష్టపడే వర్గం ఏనాడూ చంద్రబాబు వైపు వచ్చే ఓటు కాదు, కాబట్టి కేసీఆర్ వల్ల నష్టం ఉంటే గింటే జగన్ కే గానీ తెలుగుదేశానికి రావల్సిన ఓట్లేమీ కేసీఆర్ వల్ల తగ్గవు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఇక తాజాగా చంద్రబాబు తీసుకున్న కీలక నిర్ణయం ఏంటంటే… ఇకపై తెలంగాణలో టీడీపీని బలోపేతం చేయాలి. అందులో బాబు వేస్తున్న తొలి పెద్ద అడుగు… ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటుచేయడం. ఇందులో భాగంగా తెలంగాణలో కీలక నేతలను పార్టీలో చేర్చుకుంటున్నారు.
ఇటీవలే తెలంగాణ టీడీపీలో కాసాని జ్ఞానేశ్వర్ లాంటి బలమైన బీసీ నాయకుడిని పార్టీలో చేర్చుకోవడం తెలంగాణ రాజకీయ పరిశీలకులనే ఆశ్చర్యానికి గురి చేసింది. కాసానిని పార్టీ అధ్యక్షుడిగా చేసి పార్టీని యాక్టివ్గా మార్చే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. బాబు ఇంత వేగంగా నిర్ణయాలు తీసుకుంటారా అని కొందరు ఆశ్చర్యపోయారు.
అంతేకాదు, బీఆర్ఎస్ ప్రకటించినప్పటి నుంచి ఆ పార్టీపై కేసీఆర్ ఎంత ఆలోచించారో తెలియదు గాని బాబు టీడీపీ తెలంగాణలో తదుపరి వేయాల్సిన అడుగల గురించి పదిరెట్లు ఆలోచన చేశారని తెలంగాణ లీడర్లు చెబుతున్నారు.
అపుడే నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై వరుస సమీక్షా సమావేశాలు జరిగాయి. నవంబర్ మొదటి వారంలో మరికొన్ని చేరికలు జరుగుతాయని సమాచారం. ఖమ్మంలో భారీ బహిరంగ సభతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మరో మూడు బహిరంగ సభలను కూడా టీడీపీ ప్లాన్ చేస్తోంది.
తెలంగాణలో టీడీపీ శిబిరంలో హఠాత్తుగా జరుగుతున్న కార్యాచరణ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కేసీఆర్ తన పార్టీ పేరు నుండి తెలంగాణను తొలగించి దాని స్థానంలో భారత్ అని పెట్టారు. BRS ఇప్పుడు జాతీయ పార్టీగా ప్రకటించబడింది మరియు అది ఆంధ్రప్రదేశ్లో కూడా పోటీ చేయబోతోంది.
కేసీఆర్ స్వయంగా ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తున్నప్పుడు, 2018 ఎన్నికల్లో లాగా తెలంగాణలో చంద్రబాబుపై ‘ఆంధ్రా’ ప్లాంక్ను ఉపయోగించలేరు. ఇది తెలంగాణ టీడీపీని మళ్లీ క్రియాశీలం చేసేందుకు చంద్రబాబును ప్రేరేపించింది. 2019లో కూడా 10 శాతం ఓటింగ్ టిడిపికి వచ్చిందంటే… అది ఏపీలో జనసేనకు వచ్చిన ఓటుకంటే ఎక్కువ. దీన్ని బట్టి బిసిలు కూడా కేసీఆర్ తో విసిగి మళ్లీ టీడీపీ వైపు చూస్తే ఇక తిరుగుండదు ఇక్కడ అంటున్నారు టీడీపీ కేడర్.