యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ల కాంబినేషన్లో తెరకెక్కిన ఆది పురుష్ చిత్రంపై ప్రభాస్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్న సంగతి తెలిసిందే. దాదాపు 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన రాధే శ్యామ్ చిత్రం ఫ్యాన్స్ ను తీవ్రంగా నిరాశపరిచింది. దీంతో, ఆది పురుష్ చిత్రంపై ఫ్యాన్స్ గంపెడాశలు పెట్టుకున్నారు. అయితే, ఇటీవల విడుదలైన ఆదిపురుస్ టీజర్…ప్రభాస్ ఫ్యాన్స్ నే కాదు రామాయణ ఇతివృత్తం నేపథ్యంలో రాబోయే ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రతి ఒక్కరి ఆశలపై నీళ్లు చల్లింది.
టెంపుల్ రన్ వీడియో గేమ్ మాదిరిగా గ్రాఫిక్స్ పెట్టారని, చిన్నపిల్లల యానిమేషన్ సినిమాలాగా ఈ టీజర్ ఉందని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. రామాయణ కథను అద్భుతంగా చూపిస్తారనుకుంటే, చివరికి ఇలా బొమ్మల సినిమా చూపిస్తారా అంటూ నెటిజన్లు పైర్ అవుతున్నారు. రావణాసురుడు, హనుమంతుడు ఎలా ఉంటారో తెలియకుండానే సినిమా తీస్తారా అని మండిపడుతున్నారు.
దీంతో బ్యాన్ ఆది పురుష్, బాయ్ కాట్ ఆది పురుష్ అనే హ్యాష్ ట్యాగ్లు ట్రెండ్ అవుతున్నాయి. అంతేకాదు, ఈ సినిమాలో హనుమంతుడు, రావణాసురుడు పాత్రలు ఇలా ఉండటంపై పలువురు బీజేపీ నేతలు కూడా ఫైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే దర్శకుడు ఓం రౌత్ పై ప్రభాస్ ఫైర్ అయినట్లు తెలుస్తోంది. టీజర్ ఇంత డిజాస్టర్ కావడంతో ఉండడంతో ప్రభాస్ తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
‘‘ఓం… నువ్వు నా రూమ్ కి వస్తున్నావు కదా? నాతో రా’’ అంటూ ప్రభాస్ వేలు చూపిస్తూ దర్శకుడు ఓమ్ ను పిలుస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. మీ రూమ్ కే వస్తున్నాను అంటూ ఆయన సమాధానమివ్వడం కనిపిసోతంది. దీంతో, ప్రభాస్, ఓం ల మధ్య చెడిందని, ఆదిపురుష్ టీజర్ లాంచ్ సమయంలో ఈ ఘటన జరిగిందని ప్రచారం జరుగుతోంది.
మామూలుగా అయితే, పబ్లిక్ ప్లేసుల్లో చిరునవ్వుతో కనిపించే ప్రభాస్ ఈ వీడియోలో కోపంగా కనిపించడం విశేషం. మరోవైపు. ఈ టీజర్ పై దర్శకుడు ఓం వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తాము భావితరాలను దృష్టిలో పెట్టుకొని త్రీడీ లో ఈ సినిమాను రూపొందించామని, పెద్దతెరపై చూస్తేనే ఈ సినిమా విజువల్స్ క్లారిటీ అర్థమవుతుందని కవర్ చేసే ప్రయత్నం చేశారు. మొబైల్ ఫోన్ల కోసం ఈ టీజర్ ని రూపొందించలేదని, దానిలో క్వాలిటీ ఇలాగే కనిపిస్తుందని అన్నారు.
https://twitter.com/i/status/1577433644398186496