తన హక్కులకు ఎన్నికల కమిషన్ భంగం కలిగించారని ఇటీవల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రివిలైజ్ కమిటీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల మంత్రి చేసిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలంటూ సభా హక్కుల కమిటీ (ప్రివిలేజ్ కమిటీ) నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు నోటీసులు పంపింది. ఈ లేఖపై స్పందించిన తాజాగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్పందించారు.
ఆయన ఏమన్నారంటే… అసెంబ్లీ సభ్యులపై తనకు గౌరవభావం ఉంది. అయితే తన నుంచి సంజాయిషీ కోరుతూ నోటీసులు పంపే అధికారం ప్రివిలేజ్ కమిటీకి లేదు అన్న విషయం గుర్తించాలని స్పష్టం చేశారు. అంతేగాకుండా ప్రస్తుతం తాను కరోనా వ్యాక్సిన్ తీసుకుని హైదరాబాదులో ఉన్నానని వెల్లడించారు. కొన్నాళ్లపాటు ప్రయాణాలకు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు లేఖ లో స్పందించారు.