షాలిని పాండే అంటే గుర్తు పడటం కాస్త ఆలస్యమవుతుందేమో గానీ.. `అర్జున్ రెడ్డి` హీరోయిన్ అంటే టక్కున పట్టేస్తారు. మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో జన్మించిన షాలిని పాండే ఇంజనీరింగ్ పూర్తి చేసింది. అయితే నటన మీద ఉన్న మక్కువతో సినీ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. అలాంటి సమయంలోనే `అర్జున్ రెడ్డి` మూవీలో ఆఫర్ వచ్చింది. విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం 2017లో విడుదలై ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు.
తొలి సినిమా అయినప్పటికీ షాలిని పాండే తనదైన నటనతో ప్రేక్షకులను ఫిదా చేసింది. యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఈ మూవీ తర్వాత తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళ భాషల్లో నటించింది. కానీ, ఎక్కడా స్టార్ ఇమేజ్ ను దక్కించుకోలేకపోయింది. అయితే కెరీర్ స్టార్టింగ్ లో బొద్దుగా ఉన్న షాలిని పాండే.. ఇటీవల బక్కచిక్కి జీరో సైజ్ కు మారింది.
ప్రస్తుతం ఈ అమ్మడు సరైన అవకాశాలు కోసం ఈగర్ గా వెయిట్ చేస్తోంది. ఇదిలా ఉంటే.. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న షాలిని పాండే వృత్తిపరమైన విషయాలే కాకుండా వ్యక్తిగత విషయాలను సైతం పంచుకుంది. ఇంజినీరింగ్ తర్వాత ఏదైనా కార్పొరేట్ కంపెనీలో మంచి ఉద్యోగం సంపాదించి లైఫ్ లో సెటిల్ అవ్వాలని అమ్మానాన్నలు కోరుకున్నారు. కానీ, తనకు సినిమాల మీద ఉన్న ఇంట్రస్ట్‌తో అటుగా అడుగులు వేశానని చెప్పుకొచ్చింది.
అదృష్టం కొద్ది `అర్జున్ రెడ్డి`లో తనను ఎంపిక చేశారని, ఆ సినిమా ఘనవిజయం సాధించడం, ప్రీతి పాత్ర అందరికీ కనెక్ట్ కావడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని షాలిని పాండే పేర్కొంది. అలాగే తనకు కమల్ హాసన్ అంటే పిచ్చ ఇష్టమని, ఆయనకు తాను వీరాభిమాని అని తెలిపింది. కమల్జీలోని కామెడీ టైమింగ్, యాక్షన్ ను తాను బాగా ఎంజాయ్ చేస్తానని వివరించింది.
ఇక ఈ క్రమంలోనే పెళ్లి ప్రస్తావన కూడా వచ్చింది. అయితే షాలిని పాండే పెళ్లికి ఇప్పట్లో నో అంటోంది. ప్రస్తుతానికి పెళ్లి ఆలోచనలు లేవని, కెరీర్ మీదే దృష్టి పెడుతున్నానని షాలిని స్పష్టం చేసింది. కాగా, షాలిని పాండే సినిమాల విషయానికి వస్తే.. ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా పరిచయం అవుతున్న `మహారాజా` సినిమాలో ఆమె కీలక పాత్రను పోషిస్తోంది. తెలుగులో మాత్రం ఈ బ్యూటీకి ఎలాంటి ప్రాజెక్ట్స్ లేవు.