టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావు పుట్టింది తెలుగుదేశం పార్టీలో.. కానీ, త్వరలో ఆయన పార్టీ మారబోతున్నాంటూ పుకార్లు వినిపిస్తున్నాయి. బీజేపీలో చేరేందుకు ఆయన రెడీ అవుతున్నారని వదంతులు వ్యాపిస్తున్నాయి. కొంతకాలం నుంచి కళా వెంకట్రావు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారని, ఈ క్రమంలోనే ఆయన టీడీపీకి గుడ్ బై చెప్పబోతున్నారని టాక్. అయితే, ఇంకా ఏ పార్టీలో చేరాలన్నదానిపై అనేక సమాలోచనలు జరుగుతున్నాయని, జనసేన కూడా పరిశీలనలో ఉందని చెబుతున్నారు.
ఇది పక్కన పెడితే ప్రధాన పార్టీలు టీడీపీ మరియు వైసీపీలో రెండింటిలోను కుమ్ములాటలు ఉన్నాయి. ఇక జనసేన ఇక్కడ అనుకున్నంతగా ఇంకా ఫాంలోకి రాలేదు. భవిష్యత్తులో బలపడొచ్చేమో చెప్పలేం. ఇక శ్రీకాకుళం బీజేపీ అంటే ఓ నలుగుకు కాళింగ సామాజికవర్గంకు చెందిన నేతలదే అన్న అభిప్రాయం ఎప్పటి నుంచో పాతుకుని పోయింది. వాళ్లు అడ్డు తొలగితే కానీ కొత్త మనుషులెవ్వరూ అక్కడ రాణించలేరు అన్న వాదనకూ కారణాలు ఎక్కువే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కళా వెంకట్రావు అనే సీనియర్ నాయకులు తన భవిష్యత్తును వెతుక్కోవాలంటే వైసీపీ తప్ప మరో ఛాయిస్ లేదు అని చర్చ జరుగుతోంది.
ఇంతకు మొన్నటివరకు ఏపీ టీడీపీ అధ్యక్ష పదవిలో ఉన్న కళా వెంకట్రావు ఎందుకు బయటకు వెళ్లాలనుకుంటున్నారు? తన మాట చెల్లనివ్వని కింజరాపు కుటుంబాలకు దూరంగా జరిగి, కొత్త రాజకీయ జెండా వెలుగుల్లో భవిష్యత్తును వెదుక్కోవాలని చూస్తున్నారట. ఇంకా ఆయన టీడీపీ వీడకనే తదుపరి రాజకీయాలు కూడా చర్చకు వచ్చేశాయి.
ఒకవేళ టీడీపీ నుంచి కళా వెంకట్రావు కనుక తప్పుకుంటే చౌదరి బాబ్జీ, మాజీ జర్నలిస్టు కలిశెట్టి అప్పలనాయుడు, ఇంకా ఇంకొందరు తమ తమ భవిష్యత్ పై మరింత ఆశలు పెంచుకోవచ్చట. అంటే ఎచ్చెర్ల రాజకీయాలను కాళింగ మరియు కాపు సామాజిక వర్గాలు కలిసి శాసించేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు. ఇప్పటికే చౌదరి, కలిశెట్టి కుటుంబాలు అచ్చెన్నకు, అంతకు మునుపు ఎర్రన్నకు అత్యంత చేరువ .
కనుక కళా అడ్డు తొలగితే ఇకపై వాళ్లంతా ప్రభావశీలకంగా రాణించేందుకు అవకాశాలు ఉన్నాయని చర్చ జరుగుతోంది. ఇప్పటికే కళా వెంకట్రావు కొడుకు రాం మల్లిక్ నాయుడు నాయకత్వాన్ని ఒప్పుకోని ఎచ్చెర్ల టీడీపీ నాయకులు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏం జరుగుతోంది అయితే.. కాలమే చెప్పాలి.
ఈ రకంగా గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో కళా వెంకట్రావుకు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, కళా వెంకట్రావు వయసు రీత్యా ఆయనను పార్టీ నుంచి తప్పించామని అచ్చెన్నాయుడు పేరిట ఓ లేఖ కూడా వైరల్ అవుతుంది. అయితే, ఆ లెటర్ ఫేక్ అని టీడీపీ అఫిషియల్ ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ రావడంతో అదంతా పుకారేనని తేలిపోయింది. అంతేకాదు, టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాల ప్రకారం తన ఇంటి మేడపైన కళా వెంకట్రావు జాతీయ జెండాను కూడా ఎగురవేసిన వీడియో కూడా ఆ లేఖ పుకారేనని తేల్చేసింది.
Comments 1