హీరో కళ్యాణ్ రామ్ అంటే తనకు ఎంతో గౌరవమని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అన్నారు. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసారకు ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణపై అల్లు అర్జున్ స్పందించారు. ట్విటర్ వేదికగా ఆయన కళ్యాణ్ రామ్‌పై ప్రశంసలు కురిపించారు.
కొత్తవారిని ప్రోత్సహించడంలో కళ్యాణ్ రామ్ ముందుంటారని.. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ నటన అద్భుతంగా ఉందని అల్లు అర్జున్ అన్నారు.
బింబిసార ఆసక్తికరమైన, ఆకర్షణీయమైన ఫాంటసీ అంటూ దర్శకుడు వశిష్ట, ఇతర సభ్యులు, టెక్నికల్ టీమ్‌కు అల్లు అర్జున్ అభినందనలు తెలిపారు.
దర్శకుడిగా వశిష్టకు తొలి సినిమానే అయినా, ఎంతో నైపుణ్యంతో ఎక్కడా తడబడకుండా ఈ సినిమాను తెరకెక్కించిన వశిష్టను అభినందిస్తున్నానని అల్లు అర్జున్ పేర్కొన్నారు.
ఈ చిత్రంలో నటించిన కాథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్ తదితరులకు, ఎంఎం కీరవాణి వంటి టెక్నీషియన్లకు, చిత్రనిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ కు నా ప్రశంసలు అంటూ బన్నీ ట్వీట్ చేశారు. అంతేకాదు, సింగిల్ లైన్ లో బింబిసార రివ్యూ ఇచ్చారు. “బింబిసార: అన్ని వయసుల వారిని రంజింపజేసే వినోద్మాక చిత్రం” అంటూ తన స్పందన తెలియజేశారు.