చంద్రబాబు అధికారంలో ఉన్నా.. లేకున్నా.. ఒక్కటే..అనేలా వ్యవహరించారు. గతంలో హుద్‌హుద్ తుఫాను వచ్చినప్పుడు.. తిత్లీ తుఫాను వచ్చి ప్రజలు ఇబ్బంది పడినప్పుడు.. ఎలా.. స్పందించారో.. ఇప్పుడు కూడా అచ్చు అలానే ఆయన రియాక్ట్ అయ్యారు. అప్పట్లో సినీ ఇండస్ట్రీని నేరుగా ఆయన కోరారు. సాయం చేయాలని.. ఫోన్లు చేశారు. అంతే.. హుద్‌హుద్.. తిత్లి.. తుఫానులకు భారీ ఎత్తున స్పందనలు వచ్చాయి. ఎన్టీఆర్ కుటుంబం సహా చిరు కుటుంబం నుంచి చిన్న చిన్న హీరో లనుంచి కూడా బాబు అడిగారు.. అంటూ.. సాయం చేశారు.
కట్ చేస్తే.. ఇప్పుడు కూడా అదే పరిస్థితి వచ్చింది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్గాలతో .. రాష్ట్రంలోని గోదావరి జిల్లాల్లో.. వరద పోటెత్తింది. దీంతో వరదల తాకిడికి… వందల సంఖ్యలో లంక గ్రామాలునీట మునిగాయి. ప్రజలు కూడూ.. గుడ్డ లేక.. నిలువునా.. మ్రాన్పడిపోయారు. ఈ పరిస్థితిని కళ్లారా చూసిన.. చంద్రబాబు.. గతంలో ఎలా అయితే.. తాను పిలుపునిచ్చారో.. ఇప్పుడు కూడా అదే పిలుపునిచ్చారు. అందరూ కలిసిరావాలని.. వరద బాధిత ప్రజలకు.. సాయం చేయాలని.. ఆయన సూచించారు.
ఇటీవల కురిసిన వర్షాలు అపార నష్టాన్ని మిగిల్చాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… దశాబ్దాల తరబడి సమకూర్చుకున్న సంపదంతా వరదపాలై కట్టుబట్టలతో ప్రజలు నిస్సహాయ స్థితిలో ఉన్నారని తెలిపారు. నిత్యావసరాలు లేక ప్రజలు దుర్భర స్థితిలో ఉన్నారని అన్నారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం చేతులెత్తేసిందని విమర్శించారు.
బాధితులను సమాజం, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ నేతలు, ఇండస్ట్రీ పెద్దలు అందరూ కలసి కట్టుగా.. ప్రతి తెలుగువారు.. బాధితులను ఆదుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇప్పటికే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కొంతమేరకు సాయం కొనసాగుతోందన్నారు. దాతలు వారి పేరుతోగానీ.. టీడీపీ ద్వారా గానీ సాయం చేయాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఈ పరిణామం చూసిన వారు చంద్రబాబు మారలేదు.. పార్టీ ప్రతిపక్షంలోఉ న్నా.. అధికార పక్షంలో ఉన్నా.. ఆయన మాత్రం ప్రజల పక్షమే ననే కామెంట్లు చేస్తున్నారు.