బుద్దా,మీరా,బొండా తో టచ్ లో వైసీపీ నేతలు
టీడీపీ ని బల్క్ గా అమ్మేసిన ఆ ‘ఇద్దరు’
తూర్పు లో ‘మాజీ మేయర్’ అర్ధరాత్రి రాజకీయం
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కు బెజవాడ టిడిపి నాయకులను చక్కదిద్దడం తలనొప్పిగా మారింది.వైసీపీ ప్రభుత్వం విజయవాడ, విశాఖపట్నం కార్పొరేషన్ ను ఎలాగయినా గెలుచుకోవాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని.వంశీ కు తెరవెనుక బాధ్యతను అప్పగించడంతో గతంలో ఉన్న పరిచయాలు తో టీడీపీ నేతలను కోట్లతో కట్టిపడేశారు. పదే పదే తాము చంద్రబాబు నాయుడు భక్తులము అని చెప్పుకునే బుద్దా,మీరా ను ఎప్పుడో వంశీ సారథ్యంలో అమ్ముడు పోయారనే చెప్పాలి.
కోట్ల రూపాయల సొమ్ము వచ్చి పడుతుంటే బుద్దా,మీరా లు వాదులు కుంటారా లేదనే చెప్పాలి.గతంలో కూడా వీరికి ఇలాంటి వాటిలో ఆరితేరిన అనుభవం ఉంది.పైకి మాత్రం చంద్రబాబు ముసుగువేసుకుని పశ్చిమ నియోజకవర్గంలో పార్టీ ను గంప గుత్తగా అమ్మేశారు. బుద్దా వెంకన్న, అతని బినామీ కళ్ళే నాగేశ్వరరావు నిత్యం వంశీ,తలశిల రఘురామ్ తో ఫోన్ టచ్ లో ఉంటూ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని టీడీపీ ని ఎలా ఓడించాలనే వ్యూహాలు లను వారికి దిశానిర్దేశం చేసి టీడీపీ ని ఓడించేందుకు కంకణం కట్టుకున్నారు…వీరిద్దరి వెనుక ఎమ్మెల్యే వంశీ ఉండటమే కాదు రోజూ టీడీపీని ఇబ్బంది పెట్టేవిధంగా ఏం చేయాలనేది కూడా వైసీపీ నుంచే డైరక్షన్ వస్తుంది.
ఎంపీ కేశినేని ను టార్గెట్ చేయడంలో ఉద్దేశం కూడా అదే,సామాజిక వర్గాలను రెచ్చకొట్టేవిధంగా బుద్దా,మీరా లు మాట్లాడం వ్యూహం లో బాగమనే చెప్పాలి.పశ్చిమ నియోజకవర్గ లో బుద్దా,మీరాలు ఇప్పటికే టీడీపీ ను సర్వనాశనం చేశారు.అయినా ఇంకా పార్టీ ను నాశనం చేసేందుకు ఎమ్మెల్యే వంశీ, వైసీపీ నాయకుడు తలశిల తో కలసి టీడీపీ ని బజారుకు ఈడ్చే పనిలో ఉన్నారు. ఇక సెంట్రల్,తూర్పు నియోజకవర్గ లో కూడా టీడీపీ లో కీలకంగా వ్యవహరించిన మాజీ ఎమ్మెల్యే బొండా కూడా గన్నవరం ఎమ్మెల్యే వంశీతో టచ్ లో ఉన్నారు. ఎంపీ నానీ ను టార్గెట్ చేయడం వీరికి నాని మింగుడు పడకపోవడమే.
వీరు ఎంపిక చేసిన అభ్యర్థులు వైసీపీ వైసీపీకి అనుకూలంగా వుండే అవకాశం రావడంతో ఎంపీ నాని వారిని మార్చారు అదే వీరికి మింగుడు పడటంలేదు.ఈ నేపధ్యంలో ఎంపీ నాని మాట జారడంతో దానిని అలుసుగా తీసుకొని బొండా ,ఎంపీ కేశినేని ను టార్గెట్ చేయడంతో పాటు బుద్దా,మీరాతో చేతులు కలిపి సెంట్రల్ లో కూడా టీడీపీని ముంచేసే బలమైన ప్రయత్నాలు చేస్తున్నారు.బుద్దా,మీరా,బొండా లకు వైసీపి ప్యాకేజీలు ఎమ్మెల్యే వంశీ ద్వారా అందేశాయి.
ఇక తూర్పు నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ టీడీపీ బలంగా ఉంది.తన భార్య కు మేయర్ చాన్స్ రానివ్వకుండా చేశారని మాజీ మేయర్ కోనేరు శ్రీధర్ తెర వెనుక కుటిల రాజకీయం మొదలు పెట్టాడు.అతనికి అర్హత లేకపోయినా చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు మేయర్ సీటులో కూర్చో బెట్టినా,ఇదే బొండా,మీరా,బుద్దా లు శ్రీధర్ ను మార్చాలని కోరినా బాబు మాత్రం శ్రీధర్ నే కొనసాగించారు.ఆ విశ్వాసం కూడా లేకుండా మాజీ మేయర్ శ్రీధర్ తూర్పు లో వైసీపీ ఇంచార్జ్ అవినాష్ తో చేతులు కలిపి అర్ధరాత్రి రాజకీయం చేస్తున్నారు.
కేశినేని శ్వేత ను ఓడించేందుకు ఆ డివిజన్ లో తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు.ఇలా ఎక్కడిక్కడ మూడు నియోజకవర్గాల్లో బుద్దా,మీరా,బొండా,మాజీ మేయర్ శ్రీధర్ లు టీడీపీ ని సర్వనాశనం చేసేందుకు కంకణం కట్టుకుంటే అధినేత ఎలా చక్కదిద్దగలరు..గెలిచే చాన్స్ వుంబ టిడిపి ని ఇప్పుడు ఒడిపోయేలా చేయబోతున్నారంటే వీరి విశ్వనీయత అర్ధం చేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు ఏం చేసినా జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.పార్టీను కాపాడాల్సిన బాధ్యత ప్రజలు,క్యాడర్ దే….