ఈ మధ్యకాలంలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ పేరు ప్రముఖంగా వార్తల్లో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ట్విటర్ కొంటానంటూ హడావిడి చేసిన మస్క్…ఆ తర్వాత ఫేక్ అకౌంట్ల విషయంలో తేడా ఉంది తూఛ్ అంటూ ఆ ఒప్పందం నుంచి తప్పుకున్నాడు. దీంతో, మస్క్ పై ట్విటర్ లీగల్ గా చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ వ్యవహారం సద్దుమణగక ముందే మస్క్ మరో వివాదంలో చిక్కుకున్నాడు.
గూగుల్ కో ఫౌండర్, బిలియనీర్ సెర్గీ బ్రిన్ భార్య నికోల్ షనన్ తో మస్క్ కు ఇల్లీగల్ అఫైర్ ఉందని ‘వాల్ స్ట్రీట్ జర్నల్’లో వచ్చిన కథనం దుమారం రేపుతోంది. చాలా ఏళ్లుగా మస్క్, బ్రిన్ లు ఫ్రెండ్స్ అని, కానీ, షనమ్ తో మస్క్ రిలేషన్ షిప్ గురించి తెలిశాక అది తెగిపోయిందని ఆ కథనంలో ఉంది. మస్క్ వల్లే తన భార్య నుంచి బ్రిన్ విడాకులకు దరఖాస్తు చేశారని, 2021 డిసెంబర్ 15 నుంచి వారిద్దరూ విడిగా ఉంటున్నారని పేర్కొంది.
ఇక, కొద్ద రోజుల క్రితం బ్రిన్ కు మస్క్ క్షమాపణలు కూడా చెప్పినట్టు తెలుస్తోంది. తన గర్ల్ ఫ్రెండ్, సింగర్ గ్రిమ్స్ తో మస్క్ విడిపోయిన కొన్ని నెలల తర్వాత మస్క్, షనన్ ల అఫైర్ బాహ్యప్రపంచానికి తెలిసింది. గ్రిమ్స్ తో మస్క్ కు ఇద్దరు పిల్లలున్నారు. ఇక, మస్క్ కు సంబంధించిన మరో అఫైర్ కూడా తాజాగా సంచలనం రేపుతోంది. టెస్లా కంపెనీలో ఎగ్జిక్యూటివ్ గా పని చేస్తున్న షివోన్ తో మస్క్ కు అక్రమ సంబంధం ఉందని, ఆ బంధానికి గుర్తుగా 2021 డిసెంబర్లో ఆమె కవల పిల్లలకు జన్మనిచ్చిందని ప్రచారం జరుగుతోంది.
దీంతో, మస్క్ పై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. మస్క్ మంచి రసికుడని, చాలామందిని లైన్లో పెట్టాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అక్రమ సంబంధాల కోసం మస్క్ ఇంత రిస్క్ తీసుకున్నాడని అంటున్నారు.
మరోవైపు, వాల్ స్ట్రీట్ జర్నల్ లో వచ్చిన ఆరోపణలను మస్క్ ఖండించారు. ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని, ఆమెతో తనకు ఎలాంటి అక్రమ సంబంధం లేదని స్పష్టం చేశారు. సెర్గీ భార్య నికోల్ ను గత మూడేళ్లలో కేవలం రెండు సార్లు మాత్రమే చూశానని చెప్పారు. ఇక, డబ్బుకు సొంతంగా విలువ, శక్తి ఉండవంటూ వేదాంత చెప్పాడు మస్క్.