మాటల్లో లోతు, విశ్లేషణ, బాధ్యత ఈ మూడు ఉంటే చాలు మంచి నాయకులు వస్తారని అంటారు. వీటికి తులతూగే రీతిలో యువ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఉంటారు. నిన్నటి వేళ వైసీపీని టార్గెట్ చేసి చాలా విషయాలు చెప్పారు. పార్లమెంట్ వర్షకాల సమావేశాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహానికి సంబంధించి అధినేత చంద్రబాబుతో బాబాయ్ అచ్చెన్నతో కలిసి నిన్నటి వేళ (శుక్రవారం) భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటిదాకా ఏమీ మాట్లాడని, మాట్లాడడం చేతగాని వారంతా ఇప్పుడు తమను తిట్టిపోస్తున్నారని అన్నారు. జలవనరుల శాఖ అప్పటి మంత్రి అనిల్ ను, అదే శాఖకు ఇప్పుడు బాధ్యతలు చూస్తున్న మంత్రి అంబటిని ప్రశ్నిస్తూ..
అసలు టెక్నికల్ టెర్మినాలజీ ఏంటన్నది తెలియకుండా ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. ముఖ్యంగా పోలవరంపై ఈ ప్రభుత్వానికి క్లారిటీ అన్నది లేనే లేదని తేల్చేశారు. మాట్లాడితే చాలు తమ అధినేతను తిట్టడంతోనే ఉన్న పాలనా కాలాన్ని వెచ్చిస్తూ వస్తున్నారని ఫైర్ అయ్యారు.
ముఖ్యంగా హోదాకు సంబంధించి మాట్లాడారు. వైసీపీ ఎంపీలు ఆ రోజు కానీ ఈ రోజు కానీ బలం ఉన్నా కూడా మాట్లాడడం లేదు. ముఖ్యమయిన సమస్యలు గురించి గొంతు వినిపించరు. అదేవిధంగా రాష్ట్రానికి వచ్చే నిధులపై గొంతు వినిపించరు. అసలు పార్లమెంట్ సెషన్ లో ఇంతవరకూ రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడిందే లేదు. అదేవిధంగా తాము మాట్లాడినా మద్దతు ఇవ్వడం లేదు. అంటే జైలుకు వెళ్తామన్న భయంతోనే వీళ్లంతా ఇలా ప్రవర్తిస్తున్నారా అని ప్రశ్నించారు.
Comments 1